విదేశీ భాషలు నేర్చుకోవాలి అనుకుంటున్నారా?..కోచింగ్ సంస్థలకి వెళ్లాల్సిన పనిలేదు!..ఈ వెబ్సైట్ చాలు!

బ‌హుభాషా కోవిదుడు… అంటే తెలుసు క‌దా..! అదేనండీ… ఒక‌టి క‌న్నా ఎక్కువ భాష‌ల్లో ప‌ట్టు ఉన్న వారిని అలా పిలుస్తారు. మ‌రీ 2, 3 భాష‌లు కాక‌, క‌నీసం ఓ నాలుగైదు అంత‌కు మించి భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా ప‌ట్టు ఉన్న వారిని అలా పిలుస్తారు. అయితే నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉండాలే గానీ ఎవ‌రైనా ఏ భాష‌నైనా నేర్చుకోవ‌చ్చు. అందులో నిష్ణాతులు కావ‌చ్చు. ఈ క్ర‌మంలో అలాంటి త‌ప‌న ఉన్న వారి కోసం, విదేశీ భాష‌లు నేర్వాల‌నే కోరిక ఉన్న‌వారి కోసం కింద ప‌లు వెబ్‌సైట్స్‌ను అందిస్తున్నాం. వాటిని ఫాలో అయితే చాలు. మీరు ఆయా భాషల్లో ప్రావీణ్యులు కావ‌చ్చు. ఆ వెబ్‌సైట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!

foreign-languages

డ్యుయోలింగో…
ఈ సైట్‌లో స్పానిష్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, ఇటాలియ‌న్‌, పోర్చుగీస్‌, డ‌చ్‌, ఐరిష్‌, డానిష్, స్వీడిష్ భాష‌ల‌ను నేర్చుకోవ‌చ్చు. రీడింగ్‌, రైటింగ్‌, లిజ‌నింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవ‌చ్చు. ఆయా భాష‌ల‌కు చెందిన లాంగ్వేజ్ లెస్స‌న్స్ ఇందులో ల‌భిస్తున్నాయి. ప్ర‌తి భాష‌పై ప‌ట్టుసాధించేలా ఇందులో ఆయా భాష‌ల‌ను నేర్చుకోవ‌చ్చు.

రొజెట్టాస్టోన్‌…
ఈ సైట్‌లో 35 కు పైగా భాష‌ల లెర్నింట్ టూల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఆయా భాషల‌ను ఇట్టే నేర్చుకోవ‌చ్చు. ఇందులో కూడా లెస్స‌న్స్ ల‌భిస్తున్నాయి. వాటితో ఆయా భాష‌ల‌కు చెందిన ప‌దాల‌పై ప‌ట్టు సాధించ‌వచ్చు. ప‌లు ర‌కాల ప‌దాల‌ను ఎలా ప‌ల‌కాలో నేర్పించే ఆడియో లెస్స‌న్స్ కూడా ఇందులో ఉన్నాయి.

బుసూ…
స్పానిష్, జ‌ర్మ‌న్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పోర్చుగీస్‌, ర‌ష్య‌న్‌, పోలిష్, ట‌ర్కిష్‌, అర‌బిక్‌, జ‌ప‌నీస్‌, చైనీస్ భాష‌ల‌ను ఈ సైట్ స‌హాయంతో నేర్చుకోవ‌చ్చు. గ్రామ‌ర్ నేర్పేందుకు ప్ర‌త్యేక‌మైన టూల్స్ ఉన్నాయి. వీడియో పాఠాల‌తో కూడా ఆయా భాష‌ల‌ను నేర్చుకోవ‌చ్చు.

లివింగ్ లాంగ్వేజ్‌…
20 ర‌కాల భాష‌ల‌ను ఈ సైట్‌లో నేర్చుకోవ‌చ్చు. వ‌కాబుల‌రీ, గ్రామ‌ర్‌, ఆడియో పాఠాలు, గేమ్స్‌, ప‌జిల్స్‌, పీడీఎఫ్‌లు ఇందులో ఉన్నాయి. వాటి స‌హాయంతో ఆయా భాష‌ల్లో ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

ఫారిన్ స‌ర్వీసెస్ ఇనిస్టిట్యూట్‌…
ఇందులో దాదాపుగా 45కి పైగా భాష‌ల‌ను నేర్చుకోవ‌చ్చు. గ్రామ‌ర్ కోసం ప్ర‌త్యేక పాఠాలు ఉన్నాయి. ఆడియో లెస్స‌న్స్ కూడా ఇందులో ల‌భిస్తున్నాయి.

బీబీసీ లాంగ్వేజెస్‌…
ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, స్పానిష్‌, ఇటాలియ‌న్‌, గ్రీక్‌, పోర్చుగీస్‌, చైనీస్ భాష‌ల‌ను ఇందులో నేర్చుకోవ‌చ్చు. ఇవే కాదు మొత్తం 40కిపైగా భాష‌ల‌ను ఈ సైట్ ద్వారా అభ్య‌సించ‌వ‌చ్చు. వొకాబుల‌రీ, క్రాస్‌వ‌ర్డ్స్‌, ప‌జిల్స్‌, గేమ్స్ రూపంలో పాఠాలు ఉన్నాయి. బిగిన‌ర్‌, ఇంట‌ర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్ లెవ‌ల్స్‌లో పాఠాల‌ను అభ్య‌సించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top