టీ/కాఫీ తాగిన తర్వాత ఎన్ని నిమిషాలకు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా.?

చ‌ల్ల‌ని ఉద‌యం వేళ‌.. వేడి వేడిగా క‌ప్పు కాఫీతో రోజును ప్రారంభించే వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. కొంద‌రికైతే ఉద‌యాన్నే బెడ్ కాఫీ తాగ‌క‌పోతే రోజు ముందుకు క‌దిలిన‌ట్టు అనిపించ‌దు. ఇంకా కొంద‌రైతే కాఫీని తాగ‌కుండా అస్స‌లు ఉండ‌లేరు. క‌ప్పుల కొద్దీ కాఫీని రోజు మొత్తంలో తాగేస్తుంటారు. అయితే ఇదంతా స‌రే.. కాఫీ గురించి మ‌న‌కు తెలియ‌ని విషయాలా..? అని మీరు అడ‌గ‌వ‌చ్చు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వేరే విష‌యం. అంటే కాఫీ గురించే.. కాక‌పోతే కాఫీ తాగాక నిర్దిష్ట స‌మ‌యానికి మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుంది ? శ‌రీరంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయి, ఏమేం క్రియ‌లు జ‌రుగుతాయి ? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొద‌టి 10 నిమిషాల‌కు…
కాఫీ తాగిన మొద‌టి 10 నిమిషాల‌కు మ‌న శ‌రీరంలో బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

20 నిమిషాల‌కు…
కాఫీ తాగాక 20 నిమిషాల‌కు అల‌సట త‌గ్గుతుంది. కొత్త శ‌క్తి వ‌చ్చిన‌ట్టు అవుతుంది. యాక్టివ్‌గా మారుతారు. చురుగ్గా ఆలోచిస్తారు. చ‌క్క‌ని నిర్ణ‌యాల‌ను తీసుకుంటారు.

30 నిమిషాల‌కు…
కాఫీ తాగాక 30 నిమిషాల‌కు శ‌రీరంలో అడ్రిన‌లిన్ త‌యార‌వుతుంటుంది. ఇది ఏకాగ్ర‌త‌ను పెంచుతుంది. ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీక‌రించ‌గ‌లుగుతారు. షార్ప్‌గా ప‌రిశీలిస్తారు.

40 నిమిషాల‌కు…
శ‌రీరంలో ఉన్న సెర‌టోనిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. మూడ్ మారుతుంది. హ్యాపీగా ఉంటారు. డిప్రెష‌న్ పోతుంది. కండ‌రాల‌కు కొత్త శ‌క్తి వ‌చ్చిన‌ట్టు ఫీల్ అవుతారు.

4 గంట‌ల‌కు..
కాఫీ తాగాక 4 గంట‌ల‌కు శ‌రీరంలో కెఫీన్ పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. మీరు ఎలాంటి ప‌నిచేయ‌కపోయినా కొవ్వు క‌రుగుతుంది. దాంతోపాటు జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్ప‌త్తి అవుతాయి.

6 గంట‌ల‌కు… 
కాఫీ తాగిన త‌రువాత 6 గంట‌ల‌కు మ‌న శ‌రీరంలో ఉండే కెఫీన్ డైయురెటిక్ ఎఫెక్ట్‌ను క‌ల‌గ‌జేస్తుంది. దీంతో మూత్రానికి వెళ్లి వ‌స్తాం. త‌ద్వారా ర‌క్తంలో ఉండే ప‌లు కీల‌క విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌ను కోల్పోతాం. దీంతో కాల్షియం మెట‌బాలిజంకు సంబంధించిన వ్యాధులు వ‌స్తాయి.

Comments

comments

Share this post

scroll to top