కనుబొమలు పలుచగా ఉన్నాయా..? అయితే ఈ టిప్స్‌ను ట్రై చేయండి..!

అందమైన ముఖానికి మరింత వన్నె తెచ్చేవి ఏవి? పెదాలు, ముక్కు, చక్కని ఆకృతి, రంగు అంటారా. అవును, అవి కరెక్టే! కానీ వాటితోపాటు మరో రెండు కూడా ఉన్నాయి. అవే కళ్లు, కనుబొమలు. అవును, చక్కని కళ్లు ఉంటే చాలు, అవి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. అయితే కళ్లే కాదు, కనుబొమలు కూడా అందమైన ముఖానికి మరింత అందాన్నిస్తాయి. అలాంటి కనుబొమలు ఒత్తుగా లేకపోతే ఇక వారి ముఖం అంత ఆకర్షణీయంగా కనిపించదు. ఈ క్రమంలో కనుబొమలు ఒత్తుగా కనపడాలంటే సహజ సిద్ధమైన పద్ధతిలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

eye-brows

ఆముదం నూనె…
ఓ కాటన్ బాల్‌ను ఆముదం నూనెలో కొంత సేపు ఉంచి అనంతరం దాంతో కనుబొమలపై 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టు రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉన్నాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే కనుబొమలు చక్కగా పెరుగుతాయి.

కొబ్బరినూనె…
చేతి వేలిపై కొన్ని కొబ్బరి నూనె చుక్కలను వేసుకుని వాటిని కనుబొమలపై 3 నుంచి 4 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టు రాయాలి. రాత్రంతా వాటిని అలాగే ఉంచాలి. ఉదయాన్నే కడిగేయాలి. 1, 2 నెలల పాటు ఇలా చేస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.

eye-brows-remedies

ఆలివ్ ఆయిల్…
కొన్ని ఆలివ్ ఆయిల్ డ్రాప్స్‌ను, కొద్దిగా తేనెను తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనుబొమలపై రాయాలి. 30 నిమిషాల పాటు ఆగిన తరువాత నీటితో కడిగేయాలి. 1 నెల పాటు ఈ చిట్కా పాటిస్తే ఒత్తయిన కనుబొమలు సొంతమవుతాయి.

కోడిగుడ్డు సొన…
కొద్దిగా కోడిగుడ్డు సొనను తీసుకుని చిక్కని క్రీంలా వచ్చే వరకు బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కనుబొమలపై రాయాలి. 20 నిమిషాలు ఆగాక చల్లని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.

కలబంద (అలోవెరా) గుజ్జు…
అలోవెరా గుజ్జును కొద్దిగా తీసుకుని కనుబొమలపై మసాజ్ చేసినట్టు రాయాలి. 40 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే కనుబొమలు బాగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Comments

comments

Share this post

scroll to top