డ‌బ్బు అత్య‌వ‌స‌రం అయిందా..? ఫ‌ర్లేదు, ఫేస్‌బుక్ ఇస్తుంది. ఎలాగో తెలుసా..?

డ‌బ్బు అనేది అంద‌రికీ అవ‌స‌ర‌మే. అది ఎవ‌రికి ఎప్పుడు అత్య‌వ‌స‌రం అవుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. డ‌బ్బులు బాగా ఉన్న వారి సంగతి ప‌క్క‌న పెడితే అవి లేని వారు చిన్న పాటి ఎమ‌ర్జెన్సీ అవ‌స‌రం వ‌చ్చినా ఇబ్బందులు ప‌డ‌తారు. తెలిసిన వారి దగ్గ‌రో, స్నేహితుల వ‌ద్దో అప్పు చేస్తారు. అది ఎందుకోసం అయినా కావ‌చ్చు. అప్పు చేస్తేనే అవ‌స‌రం తీరుతుంది. అయితే స‌రైన టైముకు అప్పు దొరికితే ఓకే. లేదంటే ఎలా..? అంటే.. ఎవ‌రి సంగ‌తి ఏమో గానీ అందుకు ఫేస్‌బుక్ మాత్రం హెల్ప్ చేస్తుంది. అవును, మీరు విన్న‌ది నిజమే. ఇప్ప‌టి వ‌ర‌కు స్నేహితుల మ‌ధ్య వార‌ధిగా, సందేశాల‌ను పంపుకునేందుకు ఉప‌యోగిప‌డిన ఫేస్‌బుక్ ఇక‌పై ఎవ‌రికైనా ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చ‌నుంది. అదీ స్నేహితుల ద్వారా అప్పు తీసుకునే సౌకర్యం యూజ‌ర్ల‌కు క‌ల్పిస్తోంది.

facebook.com/fundraisers అనే లింక్‌ను విజిట్ చేస్తే చాలు. ఎవ‌రైనా ఫేస్‌బుక్‌లో డ‌బ్బుల కోసం రిక్వెస్ట్ పెట్ట‌వ‌చ్చు. దీంతో స‌ద‌రు యూజ‌ర్‌కు చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ స్పందించి ఆ లింక్‌ను క్లిక్ చేసి డ‌బ్బులు ఇస్తారు. అది డొనేష‌న్ లేదా అప్పు ఎలా అయినా కావ‌చ్చు, యూజ‌ర్లు ఆ డ‌బ్బును ఈ లింక్‌లో రిక్వెస్ట్ చేయ‌వ‌చ్చు. అయితే యూజ‌ర్లు తాము ముందే కొంత గోల్‌ను సెట్ చేసి ఉంచాలి. తమ‌కు కావ‌ల్సిన మొత్తం పూర్త‌యినా కాకున్నా యూజ‌ర్లు త‌మ ఫేస్‌బుక్ స్నేహితుల ద్వారా అందిన మొత్తాన్ని బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే ఇందుకు గాను ఫేస్‌బుక్‌కు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

సాధార‌ణంగా యూజ‌ర్లు ఈ పద్ధ‌తిలో గ‌న‌క డ‌బ్బు క‌లెక్ట్ చేస్తే అప్పుడు మొత్తం డ‌బ్బులో 6.9 శాతం సొమ్మును ఫేస్‌బుక్‌కు చెల్లించాలి. అంతేకాకుండా పేమెంట్ ప్రాసెసింగ్, వెట్టింగ్, సెక్యురిటీ వంటి ఇత‌ర సేవ‌ల‌కు గాను మ‌రో 30 శాతం సొమ్మును అవ‌స‌రం అనుకుంటే చెల్లించాల్సి వ‌స్తుంది. అలా చెల్లించాక మిగిలిన మొత్తం యూజ‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. దీంతో యూజ‌ర్ ఆ సొమ్మును త‌న బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్ డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఏ యూజ‌ర్ అయినా డ‌బ్బును రిక్వెస్ట్ చేసుకోవాలంటే అది ఎందుకోస‌మే చెప్పాలి. చదువు, వైద్యం, పెట్ మెడికల్, విపత్తు సహాయం, వ్యక్తిగత అత్యవసరాలు, అంత్యక్రియలు, నష్టాలు, స్పోర్ట్స్, కమ్యూనిటీ ఇలా అనేక విభాగాలు ఉంటాయి. వాటిల్లో స‌రైన ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. అది నామమాత్ర‌మే. అలా ఎవ‌రైనా సంబంధిత కేటగిరీని ఎంపిక చేసుకున్నాక డ‌బ్బును రిక్వెస్ట్ చేసి పైన చెప్పిన విధంగా దాన్ని విత్ డ్రా చేసుకోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top