జాబ్ కావాలా… అయితే పోస్టాపీస్ కు వెళ్లండి…

జాబ్ కావాలా… అయితే పోస్టాపీస్ కు వెళ్లండి… మీరు చదివింది నిజమే… ఒకప్పుడు జాబ్ కావాలంటే ఏం చేసే వాళ్లమో గుర్తుందా? ఎప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌కెళ్లి వివరాలను నమోదు చేసుకుని వచ్చే వాళ్లం.. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు  వచ్చాక.. కంపెనీలే కాలేజీకెళ్లి తమకు క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ వాళ్లకి కావల్సిన  స్కిల్స్ ఉండే వాళ్లని ఎంపిక చేసుకుంటున్నాయి…క్రమంగా ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ వ్యవస్థ బలహీన మైంది..అందుకే కేంద్రం NCS  పథకం అందుబాటులోకి తెచ్చింది…NCS అంటే నేషనల్ కెరీర్ సర్వీస్… దీన్ని పోస్టాఫీసులతో అనుసంధానించి మన హైదరాబాద్‌ నుంచే ప్రారంభించారు…

ఉద్యోగం కావాలనుకువారు చేయాల్సిందల్లా.. దగ్గర్లోని ఎన్‌సీఎస్‌ సెంటర్ ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవడమే. నమోదైన వివరాలు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరతాయి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం కంపెనీలు జాబ్‌మేళాలను నిర్వహిస్తాయి. జాబ్ మేళాలను నిర్వహించే సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. జాబ్ మేళాల్లో ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, పోస్టల్ శాఖలు కలిసి ఈ పథకాన్ని చేపడుతున్నాయి. ఈ విధానంలో సంస్థలు అభ్యర్థులకు నైపుణ్యాలను పెంచుకోవడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తాయి.

Comments

comments

Share this post

scroll to top