మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ పొజీషన్ లో కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త కండరాలు సహజగుణాన్ని కోల్పోతాయి.

కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే ‘డబ్ల్యూ సిట్టింగ్‌’గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడిమలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల శక్తి ‘డబ్ల్యూ సిట్టింగ్’ పొజిషన్ వల్ల నిస్తేజమవుతుంది. ప్రధానంగా పొత్తి కడుపు, వెన్నెముక కండరాలపై ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది.
g1h9qevreizt4hla7rzf
‘డబ్ల్యూ సిట్టింగ్’ పొజిషన్ వల్ల శరీరంలోని పై భాగంలో ఉండే కండరాలు తమ సహజమైన వంగే గుణాన్ని కోల్పోతాయి. దీని వల్ల శరీరం ఒకే పొజిషన్‌కు పరిమితమై ఎల్లప్పుడూ టైట్‌గా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. పిల్లలు పెద్ద వారైన తరువాత భవిష్యత్‌లో ఎక్కువ బరువున్న వస్తువులను మోయలేరు. అంతేకాదు శరీరాన్ని, బరువును బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరమవుతుంది. ‘డబ్ల్యూ సిట్టింగ్’ పొజిషన్ వల్ల కండరాలు, నడుం, మోకాళ్లు, మడిమలు గట్టిపడి టైట్‌గా ఉండిపోతాయి. ఇది భవిష్యత్తులో కాళ్లు, వెన్ను నొప్పులకు దారి తీస్తుంది.
anhtd47k31i3nvmkglgw
ఇవే కాదు కాళ్లను ఒకదాని ఒకటి వేసి కూర్చోవడం (క్రాస్ లెగ్ సిట్టింగ్), ఒక పక్కగా కూర్చోవడం (సైడ్ సిట్టింగ్), ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా పిల్లల కండరాలు వంగే గుణాన్ని కోల్పోతాయి.
b7k1pmt3sbpb70334jsw

Comments

comments

Share this post

scroll to top