హైదరాబాద్ స్టార్ హోటల్ లో “వ్యభిచారం”..పట్టుబడ్డ ఇద్దరు హీరోయిన్లు..! ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష,

హైదరాబాద్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని తాజ్ దక్కన్ స్టార్ హోటల్‌లో.పోలీసులు దాడులు జరిపారు. ఈ రైడ్స్‌లో జూన్‌ సినిమా ఫేం రిచా సక్సేనా పట్టుబడింది. వివరాల లోకి వెళ్తే..

రిచా శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 1లోని హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి శనివారం రాత్రి హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేసి సినీ నటిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు సహకరిస్తున్న మోనీష్‌ కడాకియాతో పాటు హోటల్‌ మేనేజర్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యభిచార వ్యవహారంమంతా ఆన్‌లైన్‌ ద్వారా సాగుతున్నట్లు తేల్చారు పోలీసులు.

అరెస్టయిన వారిలో బాలీవుడ్ నటి రీచా సక్సేనా (జూన్ ఫేమ్), బెంగాలీ నటి శుభ్రచటర్జీ (బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తోంది), నిర్వాహకుడు మోనిక్‌లు ఉన్నారు. వీరిలో ఒక నటి తాజ్ డెక్కన్‌లో, మరో నటి తాజ్ బంజారాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. విటుల రూపంలో వెళ్లి వీరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన జనార్ధన్ అలియాస్ జానీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top