ఓ మనసా ప్రేమలోన ముంచేశావు తెలుసా…గుండెల్లో నువ్వు తప్ప లేదే ధ్యాస..!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్, అందాలభామ రెజీనా జంటగా దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ శౌర్య’. కుటుంబ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ , టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని “ఓ మనసా  ప్రేమలోన ముంచేశావు తెలుసా… గుండెల్లో నువ్వు తప్ప లేదే ధ్యాస” అంటూ సాగే పాటను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మాయి ప్రేమలో పడ్డ తర్వాత ఆ అమ్మాయి గురించే ఆలోచన తప్ప మనసులో ఇంకే ఆలోచనలు లేవు, నా హృదయమంతా నువ్వే ఉన్నావని” ప్రేమికుడు ఎంతో అనుభూతికి లోనవుతూ, హృదయాన్ని అత్తుకునేలా ఉన్న ఈ పాటకు కృష్ణ చైతన్య మాటలకందని సాహిత్యం రాయగా, వినసొంపైన సంగీతంతో కట్టిపడేశారు మ్యూజిక్ డైరెక్టర్ కె.వేద మరియు ర్యాప్ ఆర్టిస్ట్ రోలర్ రైడ్ రాహుల్. ఇక యాజిన్ నజీర్, హేమచంద్ర తమ గాత్రంతో మెప్పించారు. అందమైన ప్రేమికులుగా మనోజ్, రెజీనాల పెయిర్ బాగుంది.సురక్ష్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

Watch Song:

Comments

comments

Share this post

scroll to top