72 ఏళ్ల వృద్ధున్ని ఇంట్లో 8 రోజుల పాటు బంధించి వెళ్లాడు ఆ నీచుడు..! నీటి కోసం ఆ వృద్ధుడు..?

మాన‌వ‌త్వం లేని మ‌నుషులు స‌మాజంలో ఎక్క‌డో ఉండ‌రు. మ‌న కుటుంటాల్లోనే, మ‌న బంధువులు, స్నేహితుల రూపంలోనే ఉంటారు. వారు ప‌రాయి వారు కాదు క‌దా, క‌నీసం తోటి వారు, తెలిసిన వారు, సొంత కుటుంబ స‌భ్యుల‌నే ఆప‌త్కాల ప‌రిస్థితుల్లో పట్టించుకోరు. దీంతో అలాంటి వారి వ‌ల్ల కొన్ని సార్లు ప్రాణాల మీద‌కు కూడా వ‌స్తుంటుంది. ఆ ప్రాంతంలో ఉండే ఓ వృద్ధుడికి కూడా స‌రిగ్గా ఇలాగే జరిగింది. అత‌న్ని చూసుకునే మేన‌ల్లుడే ఒక్క‌సారిగా అత‌న్ని ప‌ట్టించుకోకుండా, రూంలో లాక్ చేసి మ‌రీ వెళ్లాడు. దీంతో ఆ వృద్ధుడు 8 రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉన్నాడు. చివ‌ర‌కు పోలీసులు, ఎన్‌జీవో స‌హాయంతో అత‌ను ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

అది ఢిల్లీలోని దిల్‌ష‌ద్ గార్డెన్‌. అందులో ఫ్లాట్ నంబ‌ర్ ఎల్ 227లో అమర్‌జీత్ సింగ్ అనే 72 సంవ‌త్స‌రాల వృద్ధుడు ఉంటున్నాడు. ఇత‌నికి సంతానం ఎవ‌రూ లేరు. 7 సంవ‌త్స‌రాల కింద‌ట భార్య కూడా చ‌నిపోయింది. దీంతో ఆ ఫ్లాట్‌లో త‌నొక్క‌డే నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఫ్లాట్‌తో అనుబంధంగా ఉండే ఓ రూమ్‌ను వేరే వారికి అద్దెకు ఇవ్వ‌గా దానికి నెల‌కు రూ.4వేలు వ‌స్తుంది. దీంతోపాటు మ‌రో రూ.2500 పెన్ష‌న్ కూడా వ‌స్తుంది. ఈ మొత్తంతోనే అమర్జీత్ సింగ్ జీవించేవాడు. ఇక ఇత‌న్ని చూడ‌డం కోసం అప్పుడ‌ప్పుడు ఇత‌ని మేన‌ల్లుడు వ‌స్తుండేవాడు.

అయితే గ‌త 8 రోజుల కింద‌ట కూడా అమర్‌జీత్ సింగ్ ను చూసేందుకు అత‌ని మేన‌ల్లుడు వ‌చ్చాడు. కాగా అమర్‌జీత్ సింగ్ కు వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల చిత్త చాంచ‌ల్యం పోయింది. దీంతో ఏ ప‌ని స‌రిగ్గా చేసుకునేవాడు కాదు. మూత్రం కూడా దుస్తుల్లోనే పోయేవాడు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన అమ‌ర్జీత్ సింగ్ మేన‌ల్లుడు త‌న మేన‌మామ‌ను వ‌దిలించుకోవ‌డ‌మే మార్గ‌మ‌ని భావించి అత‌న్ని ఆ ఫ్లాట్‌లోనే బంధించి బ‌య‌ట లాక్ వేసి చెక్కేశాడు. దీంతో 8 రోజుల పాటు అమ‌ర్‌జీత్ సింగ్ నీళ్లు, ఆహారం లేకుండా గ‌డిపాడు. కాగా ఆక‌లి, ద‌ప్పిక బాధ‌ను త‌ట్టుకోలేని అమ‌ర్‌జీత్ సింగ్ కేక‌లు వేస్తుండ‌డంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న వారు గ‌మ‌నించి ఎన్‌జీవోకు, పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వ‌చ్చి అమర్‌జీత్‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఎన్‌జీవో వారు అత‌నికి ఆహారం, నీరు ఇచ్చారు. ప్ర‌స్తుతం అమర్‌జీత్ సింగ్ ప‌రిస్థితి నిల‌క‌డగా ఉంది. చూశారుగా… మ‌నుషుల్లో రోజు రోజుకీ మాన‌వ‌త్వం న‌శించిపోతుంద‌న‌డానికి ఇంత‌కు మించిన నిద‌ర్శ‌నం మ‌రొక‌టి ఏముంటుంది చెప్పండి ?

Comments

comments

Share this post

scroll to top