ఆ 25 ఏళ్ల యువ‌తి 70 ఏళ్ల వృద్ధున్ని పెళ్లి చేసుకుని ఫేస్ బుక్ లో ఫోటో పెట్టింది..! కామెంట్స్ లో ఏమంటున్నారో తెలుసా.?

సోష‌ల్ మీడియా అంటే అంతే. ఎప్పుడు ఏది వైర‌ల్ అవుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. మ‌నం అనుకోని అనేక విష‌యాలు అందులో వైర‌ల్ అవుతుంటాయి. అయితే వాటిల్లో కొన్ని వివాదాలుగా మారుతుంటాయి. కొన్నింటికి నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తారు. విమ‌ర్శ‌ల‌ను గుప్పిస్తారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇలాంటి ఓ వైర‌ల్ న్యూస్ గురించే. అదేమిటంటే… 70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న ఓ వ్య‌క్తి త‌న‌క‌న్నా 45 ఏళ్ల చిన్న‌గా అంటే 25 ఏళ్ల యువ‌తిని వివాహం చేసుకున్నాడు. దీంతో అత‌న్ని, ఆమెను సోష‌ల్ మీడియాలో నెటిజన్లు టార్గెట్ చేశారు. దీంతో ఇప్పుడీ న్యూస్ వైర‌ల్ అయింది.

అస్సాంకు చెందిన రాజేష్ కుమార్ హిమాత్సింగ (70) అనే వ్య‌క్తి త‌న పేరిట ఉన్న అనేక కంపెనీల‌కు ఓన‌ర్‌. ఇత‌నికి ఎన్నో కోట్ల ఆస్తి ఉంది. ఆటో మొబైల్స్‌, రిక్రియేష‌న‌ల్‌, హాస్పిట‌ల్స్‌, వ్య‌వ‌సాయం, ట్రేడింగ్, ఫైనాన్స్‌, రియ‌ల్ ఎస్టేట్‌, హెల్త్ వంటి అనేక రంగాల‌కు చెందిన కంపెనీలు ఉన్నాయి. అయితే ఇత‌ని భార్య ఎప్పుడో చ‌నిపోయింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇత‌ను త‌న క‌న్నా 45 సంవ‌త్స‌రాల చిన్న వ‌య‌స్సు అంటే 25 ఏళ్లు క‌లిగిన ఓ యువ‌తిని వివాహం చేసుకున్నాడు. కాగా వీరి వివాహం ఫొటోల‌ను ఎవ‌రో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైర‌ల్ అవుతున్నాయి.

అలా రాజేష్ కుమార్ ఆ యువ‌తిని పెళ్లి చేసుకోవ‌డం ఏమో గానీ చాలా మంది వారిని విమ‌ర్శిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ల‌ను పెడుతున్నారు. అత‌ను త‌న మ‌న‌వ‌రాలి వ‌య‌స్సు ఉన్న ఆమెను పెళ్లి చేసుకోవ‌డం ఏంటి ? షేమ్ కాక‌పోతే ! అని కొంద‌రు అంటుంటే… ఈ వ‌య‌స్సులో అత‌నికి పెళ్లి అవ‌స‌ర‌మా, చేసుకుంటే బాగా ఏజ్ ఉన్న విధ‌వ లేదా వేరే డైవోర్స్ అయిన మహిళ‌ను చేసుకోవ‌చ్చు క‌దా, 25 ఏళ్ల యువ‌తి కావ‌ల్సి వ‌చ్చింది అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు ఆ యువ‌తిని విమర్శిస్తున్నారు. ఆమె కేవ‌లం రాజేష్ కుమార్ డ‌బ్బు కోస‌మే పెళ్లి చేసుకుంద‌ని కొంద‌రు అంటున్నారు. అయినా… వారిద్ద‌రికీ అంగీకారం అయితే జ‌నాల‌కు ఎందుకు ? ఎవ‌రి ఇష్టం వారిది. వాళ్లు మేజ‌ర్లే క‌దా, వారి లైఫ్ వారికి తెలుసు క‌దా. ఏమంటారు..!

 

Comments

comments

Share this post

scroll to top