ప్రయాణాలలో వాంతులవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చాలామందికి బస్ ప్రయాణం పడదు..బస్ లో ప్రయాణం చేసేప్పుడు వికారంగా,కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది..దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది… ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి బయటపడవచ్చు..

  • చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు.
  • వక్కపొడి లాంటిది చప్పరిస్తున్న కూడా ఈ ఫీలింగ్ నుండి బయటపడొచ్చు.
  • నిమ్మకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలుస్తుంటే కూడా ఈ సమస్య ను తగ్గించుకోవచ్చు…
  • లవంగాలు,సోంపు లాంటివి కూడా దవడకు పెట్టుకుని చప్పరిస్తున్న కూడా వాంటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది..
  • మరీ ముఖ్యంగా బస్ లో కానీ ,కార్లో కానీ ప్రయాణించేప్పుడు ముందు సీట్లో కూర్చుని మన దృష్టి కూడా స్ట్రెయిట్ గా చూసినట్టయితే వామిటింగ్ సెన్సేషన్ నుండి తప్పించుకోవచ్చు…

 

Comments

comments

Share this post

scroll to top