ఉదయం చనిపోతే సాయంత్రం వరకు దానిని ఎవరూ దాచిపెట్టారు వివేకా హత్య కేసులో జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్!!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల మృతి చెందాడు. మొదట గుండెపోటుతో మరణించాడని అందరూ భావించిన, పోస్టు మార్టం చేసేటప్పుడు తలపై కత్తి పోట్లు, తొడపై గాయం ఉండటంతో హత్య చేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్య గావించబడ్డ వివేకా పేరుతో ఓ లెటర్ కూడా దొరికింది. ఈ హత్య కేసు విషయమై కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హత్య జరిగాక ఏం జరిగింది. లేఖను సాయంత్రం దాకా ఎందుకు బయటపెట్టలేదనే వివరాలను ఆయన వెల్లడించారు.


మొత్తం 12 క్లూస్ టీంలతో కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ కేసును విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి 20 మందిని విచారించామని.. మొదట రక్తపు వాంతులతో, హార్ట్ ఎటాక్ కారణంగా వివేకానంద చనిపోయారని విఎం తమకు చెప్పినట్టు వెల్లడించారు ఎస్పీ. అయితే పోలీసులు వచ్చే వరకు ఆగకుండా రక్తపు మరకలను ఎందుకు కడిగారని ఎస్పీ ప్రశ్నించారు.

వివేకానంద రెడ్డి చనిపోయాక వాచ్‌మెన్, వివేకా పీఏ సైడ్ డోర్ నుంచి వెళ్లారు. అప్పటికీ వివేకానంద రెడ్డి మృతదేహం బాత్రూమ్‌లో పడి ఉంది. పీఏ కృష్ణా రెడ్డి ఈ విషయాన్ని బంధువులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హార్ట్ అటాక్‌తోనే మరణించాడని పీఏ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంటనే సంఘటనా స్థలానికి వెంటనే బయల్దేరి వెళ్లారు. అప్పటికే 20 మంది వరకు అక్కడున్నారు. పోలీసులు వెల్లెలోపే డెడ్ బాడీని బాత్రూం నుంచి బెడ్రూంకి తీసుకొచ్చారు. బాత్ రూమ్ లో ఉన్న రక్తపు మరకలను తుడిచేశారు. గాయాలను గుడ్డతో కట్టారు. రక్తపు వాంతుల కారణంగా కమోడ్‌లో పడి తలకు గాయాలై ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారని ఎస్పీ వివరించారు.

తర్వాత డెడ్ బాడీని పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. బయటి నుంచి ఎవరూ వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఇది హత్య అని తేలింది. సాయంత్రానికి కర్నూలు డీఐజీ అక్కడికి వచ్చారు. మృతుడి భార్య సౌభాగ్య రెడ్డి, కుమార్తె సునీతలను విచారించారు. వెంటనే సునీత ద్వారా వివేకానంద పీఏ కృష్ణారెడ్డి వివేకానంద రాసిన లేఖను డీఐజీకి అందజేశారు.

అయితే ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య జరిగిన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ లేఖను ఎందుకు ఇప్పటి వరకూ దాచిపెట్టారని. ఆ లేఖను పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని డీఐజీ ప్రశ్నించారు. అందుకు ఆ లెటర్‌‌లో వివేకానంద డ్రైవర్ ప్రసాద్ పేరుంది కాబట్టి ఆయనకు ప్రాణహాని ఉందనే భయంతోనే దాన్ని బయటపెట్టవద్దని..నేను వచ్చేంత వరకు లేఖను జాగ్రత్తగా ఉంచాలని నాన్న పీఏకు చెప్పానని వివేకా కుమార్తె సునీత పోలీసులకు సమాధానం ఇచ్చారు.

లెటర్‌లో ఉన్న హ్యాండ్ రైటింగ్ వివేకానంద రెడ్డిదేనని ఆయన పీఏ, సునీత తెలిపారు. ఆ లెటర్‌ను ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపినట్టు ఎస్పీ చెప్పారు. సిట్ ఏర్పాటు చేసి ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అనుమానం ఉన్న 20 మందిని విచారించి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఫోరెన్సిక్ విభాగాలను సైతం ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని త్వరలోనే ఈ కేసును చేదిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

comments

Share this post

scroll to top