వివాహితపై కన్నేసి,భర్తను హతమార్చాలనుకున్నాడు.. చివరికి కథ అడ్డం తిరిగింది..ఎలాగో తెలుసా??

ప్రియుడితో జీవితాన్ని పంచుకోవడానికి భర్తలనే హతమార్చిన భార్యల కథలు ఒక వైపు..ప్రియురాలి కోసం భార్యలను వేధిస్తున్న భర్తలు మరోవైపు. భార్యాభర్తల మధ్య మనస్పర్దలు సృష్టించి,వారిద్దరిని వేరు చేసి ఆమెను సొంతం చేసుకోవాలనుకున్న ఒక కామాంధుడి కథ ఇది..అసలు మనుషులకు ఇన్ని ప్లాన్లు ఎలా వస్తున్నాయో అర్దం కావట్లేదు..ఇప్పటి వరకు ఎంతటి క్రై ,థ్రిల్లర్ సినిమాలో కూడా ఇంత ఆసక్తికరమైన కథనం వచ్చుండదు…కావాలంటే మీరే చదవండి..

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 వెంకటేశ్వరనగర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో స్పెషల్‌ క్వాలిటీ మెయింటెనెన్స్‌ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలున్నారు..కాగా గత ఏడాది సెప్టెంబర్‌ 2న శ్రీకృష్ణానగర్‌కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్‌ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్‌ చేసింది. ఆ సమయంలో ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన మాల్యాద్రి అంబులెన్స్‌తో పాటు అక్కడికి వచ్చాడు.అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్‌ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్‌లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్‌ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్‌ను క్రియేట్‌ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు.మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసి తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని  వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.ఇదే అదునుగా   ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకుని నందినగర్‌కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి  ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు.

ఇక్కడే కథ అడ్డం తిరిగింది.. రామారావు ఈ హత్య చేయకపోగా విషయం మొత్తాని పోలీసులకు చెప్పాడు.దాంతో  దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు, ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు.. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్‌ ఇచ్చినట్లు అంగీకరించాడు..

Comments

comments

Share this post

scroll to top