“వైవా హర్ష” కొత్త షార్ట్ ఫిలిం చూస్తే నవ్వాపుకోలేరు..! క్లైమాక్స్ ట్విస్ట్ అధుర్స్..! [VIDEO]

పరీక్షలు స్టార్ట్ అయ్యాయి..ప్రిపరేషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి..మనలో చాలా మంది ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో  కొత్తగా చెప్పక్కర్లేదు..లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సరిగా రాయకపోతే వచ్చే ఏడాది ఎలా అయినా ముందు నుండి బాగా ప్రిపేర్ అవ్వాల్రా అనుకుంటాం కానీ..అసలు ఆ విషయమే మర్చిపోతాం… ఇప్పుడు పరీక్షలు స్టార్ట్ అయ్యాక మనం చేసే హడావిడి మామూలుగా ఉండదు.మన హడావిడి చూసి మనం తెగ కష్టపడిపోతున్నామని మన అమ్మానాన్న నానా హైరానా పడిపోతుంటారు..కొందరు కంబైన్డ్ స్టడీస్ అంటూ ఫ్రెండ్స్ ఇళ్లకు పోతే,అక్కడ ముచ్చట్లు తప్ప ఏం ఉండవ్..

ఇంకొందరు కొద్దిసేపు  టీవి చూసినతర్వాతో,ఫోన్ చూసుకున్న తర్వాతనో చదవడం స్టార్ట్ చేస్తాం అనుకుంటాం..ఆ కొద్ది సేపు కాస్తా ఎగ్జామ్ టైం దగ్గర పడేంతవరకూ అందులోనే ఉంటాం..అలారం పెట్టుకుంటాం పాపం మోగి మోగి వాచ్ అలిసిపోవాలి తప్ప మన నిద్ర మాత్రం ఆగదు..ఇక కాపీ రాయుళ్ల గురించి చెప్పక్కర్లేదు..జెరాక్స్ సెంటర్ల వాళ్లకి బోలెడు గిరాకీ ఎలా అనుకుంటున్నారా…. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గురించి వచ్చిన ఒక ఫన్నీ షార్ట్ ఫిలిం చూస్తే మీకే అన్ని తెలుస్తాయి..అంతేకాదు బోలెడు నవ్వులే నవ్వులు.. ఒకసారి చూడండి మరి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top