చెస్ కొత్త లోగో మీద వచ్చిన ఈ 5 సెటైర్లు చూస్తే నవ్వాపుకోలేరు..విశ్వనాథన్ ఆనంద్ ఏమన్నారంటే.?

నిజంగా ఒక్కోసారి కొంద‌రు చేసే ప‌నులు చిత్రంగా, ఫన్నీగా ఉంటాయి. వారు వాటిని ఎందుకు చేస్తారో తెలియ‌దు, చేశాక మాత్రం అవి హాస్యాస్ప‌దంగా ఉంటాయి. అంతే కాదు అలాంటి ప‌నుల్లో కొన్ని వివాదాల‌కు కూడా దారి తీస్తుంటాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ఓ విషయం గురించే. లండ‌న్‌లో 2018లో వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్ షిప్ నిర్వ‌హించ‌నున్నారు క‌దా. అవును, అదే. క‌రెక్టే, నిర్వ‌హిస్తున్నారు, అందులో త‌ప్పేముంది ? అని అడుగుతున్నారా ? త‌ప్పులేదు. కానీ ఆ టోర్న‌మెంట్‌కు సంబంధించిన లోగోను తాజాగా విడుద‌ల చేశారు. అదే వివాదాల‌కు దారి తీస్తోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

2018లో లండ‌న్‌లో నిర్వ‌హించ‌నున్న వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్ షిప్ లోగోను తాజాగా విడుద‌ల చేశారు. దాన్ని చిత్రంలో చూశారు క‌దా, ఎలా ఉంది. నిజానికి అది చెస్ టోర్న‌మెంట్ లోగోలా లేదు క‌దా. దాన్ని చూస్తే మీకు ఏం గుర్తుకు వ‌స్తుంది ? అవును, కామ‌సూత్ర పొజిష‌న్ గుర్తుకు వ‌స్తుంది క‌దా. క‌రెక్టే, ఇదే విష‌యాన్ని ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు. ఆ లోగోను చూస్తే కామ‌సూత్ర పొజిష‌న్‌లా ఉంద‌ని చాలా మంది అంటున్నారు. ఇంత‌కు మించి మంచి లోగో దొర‌క‌లేదా, ప్రొఫెష‌న‌ల్ ఆర్టిస్ట్‌ల‌ను పెట్టి లోగో డిజైన్ చేయించ‌వ‌చ్చు క‌దా.. అని చాలా మంది ట్విట్ట‌ర్‌లో అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక చెస్ చాంపియ‌న్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ కూడా ఈ లోగో ప‌ట్ల స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే… 2018 వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్ షిప్ లోగో బాగా ఇబ్బందిక‌రంగా ఉంద‌ని అన్నారు. ఈ లోగో వ‌ల్ల చెస్ గేమ్‌ల‌ను రాత్రి పూట ప్ర‌సారం చేస్తార‌ని, అలా జ‌ర‌గ‌కుండా ఉంటే బాగుంటుంద‌ని అన్నారు. దీంతో చాలా మంది ఆనంద్ వ్యాఖ్య‌ల‌తో ఏకీభిస్తున్నారు. చెస్ గేమ్ ఇక సెక్సీగా మారింద‌ని, శృంగారం చెస్‌లో చేరినందుకు సంతోషంగా ఉంద‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లోగో వివాదం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు. ఇక‌నైనావారు ఆ లోగోను మారుస్తారా లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top