అంత సీక్రెట్ గా ఉంచినా…ఆ విషయాలు ఎలా లీక్ అయ్యాయి? ఇవాంకా విందు సమయంలోనే..!

ఇవాంక వస్తుందని రోడ్లపై బిచ్చగాళ్లు లేకుండా,కుక్కలు లేకుండా..ఆకరుకి దోమలు,కంపెనీలు వదిలే పొగ అన్నింటిపై నియంత్రణ తీసుకొచ్చింది ప్రభుత్వం..ఆమె పీల్చే గాలి కూడా స్వఛ్చమైనదే ఉండేలా ఎన్నో శ్రద్దలు తీసుకుంది..ఇక్కడ పోలీసులపై నమ్మకం లేక అమెరికన్ సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్స్‌తో కూడిన అత్యంత టైట్ సెక్యూరిటీ, మరోవైపు సెంట్రల్ ఇంటలిజెన్స్ నిఘా(సీఐఏ) మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇవాంక హైదరాబాద్ టూర్ ప్లాన్ చేశారు…ఆమె ప్రతిచర్యను కూడా చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది..అయినప్పటికీ ఆమె పర్యటనకు సంభందించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయి..దీంతో అవాక్కవడం సిఐఎ వంతైంది..

ఎలా లీకయ్యాయి??

తొలిరోజు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సులో పాల్గొన్న తర్వాత రాత్రి 8గం.కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు ఇవాంక.వంద కన్నా ఎక్కువమంది ఒకేసారి భోజనం చేయడానికి అనువుగా ఉన్న ఈ డైనింగ్ టేబుల్ పై ఇవాంకా ఎక్కడ కూర్చుంటారన్నది సీఐఏ తొలి నుంచి గోప్యంగా ఉంచుతూ వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫలక్‌నుమా డైనింగ్ టేబుల్‌పై ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విందు ఆరగించారు. విందు జరుగుతున్న సమయంలో మీడియాలో ‘101వ టేబుల్ పై ఎవరు కూర్చున్నారు?.. ప్యాలెస్ లోని ఇతర వీవీఐపీలు, వారి భద్రతకు సంబంధించిన సీసీటివి ఫుటేజీ’ టీవి ఛానెల్స్  ప్రసారం చేసాయి.భద్రతా అంశాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ… అవెలా బయటకి వచ్చాయని భద్రతా అధికారులు కంగు తిన్నారు..


దీంతో ఇవాంక రెండో రోజు సదస్సులో పాల్గొన్న తర్వాత కార్యక్రమాల గురించి షెడ్యూల్‌లో పేర్కొనలేదు. ఇవాంకా ఒకవేళ షాపింగ్ లేదా హైదరాబాద్ లోని ఇతర స్పాట్స్ చూడటానికి వెళ్లాలనుకుంటే.. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.అసలే ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని సీఐఏకు ఇప్పుడి సెక్యూరిటీ లీక్ మరింత అపనమ్మకాన్ని పెంచుతుందేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

Comments

comments

Share this post

scroll to top