తమిళ చిత్రసీమలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. గజనీకాంత్ చిత్ర సమయంలో దగ్గరైన ఆర్య, సాయేషాలు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక వారి తర్వాత తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కూడా ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఆర్య, సాయేషా ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో మార్చి 2వ వారంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే తన పెళ్లికి హాజరుకావాలంటూ ఆర్య విశాల్ ఇంటికి వెళ్లి పెళ్లికి రావాలని ఆహ్వానించాడు.
సాయేషా, ఆర్య ల పెళ్లి మార్చి 10న హైదరాబాద్ లో జరగనుంది. అనంతరం చెన్నైలో సినిమా ఇండస్ట్రీ అందరిని పిలిచి చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్య తన పెళ్లి నేపధ్యంలో తన మొదటి వివాహ పత్రికను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కు అందజేసాడు. విశాల్ ఇంటికి వెళ్లి వెడ్డింగ్ కార్డ్ అందించి సెల్ఫీ దిగాడు.
అయితే ఆర్య వెడ్డింగ్ కార్డ్ ఇస్తున్న ఫొటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. “ నా హృదయానికి చాలా దగ్గరైన ఫొటో… నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య పెళ్లి శుభలేఖ అందింది. చాలా ఆనందకరమైన క్షణాలను అనుభవించాను. ఆర్య, సాయేషా వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేసాడు.
అయితే గజనీకాంత్ చిత్రం ద్వారా దగ్గరైన ఈ జంట తమ పెళ్లి గురించి ప్రేమికుల రోజు వెల్లడించారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వీరి వివాహం మార్చి 9న జరగనుంది.
ఇదెలా ఉంటే విశాల్ కూడా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా ఫేమస్ అయిన అనిశా రెడ్డితో ఈ మధ్య కాలంలోనే నిశ్చితార్థం కూడా అయింది. తమిళ నిర్మాతల మండలి భవనం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొంటానని చెప్పిన విశాల్ తన మాటను నిలబెట్టుకొన్నాడు. త్వరలోనే ఆ భవన నిర్మాణం పూర్తి కానున్నది.
Tweet:
This pic is the closest to my heart. Unbelievable moment to hold my best friend’s @arya_offl wedding invitation .. wishing him and @sayyeshaa all the best and lots of love .. God bless ! pic.twitter.com/6rDhNwOY1V
— Vishal (@VishalKOfficial) February 27, 2019