విరుష్క పెళ్లిపై సోషల్ మీడియాలో వచ్చిన ఈ 5 జోకులు చూస్తే నవ్వాపుకోలేరు.! కోహ్లీ.. పెళ్లి క్యాన్సిల్ చేసుకుని

ఎట్టకేలకు ఇండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మకు వివాహం అయిపోయింది. ఈ విషయంపై ఇరువర్గాలు కూడా చివరి వరకు రహస్యాన్ని మెయింటెయిన్‌ చేశాయి. చివరకు తమకు పెళ్లి అయిపోయిందని చెప్పి కోహ్లి అనౌన్స్‌ చేసేశాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అయితే ఇది సరే.. కానీ విరాట్‌, అనుష్కల పెళ్లి రద్దు అంటూ ట్విట్టర్‌లో జోకులు మాత్రం విపరీతంగా పేలుతున్నాయి. అవును, కరెక్టే. అందుకు కారణం ఉంది. అదేమిటంటే…

తాజాగా ధర్మశాలలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంక చేతిలో ఘోర ఓటమి పాలైంది కదా. ఆ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 112 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. వికెట్‌ కీపర్‌ ధోనీ ఆడబట్టి ఆ మాత్రం పరుగులనైనా ఇండియా స్కోరు బోర్డులో ఉంచగలిగింది. లేకపోతే వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా టీమిండియా ఘోర అపవాదును మూటగట్టుకుని ఉండేది. ఇక ఆ మ్యాచ్‌లో తరువాత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. అయితే ఈ ఘోర ఓటమిని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే విరాట్‌ కోహ్లిని వచ్చేయమని వారు రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

అనుష్క శర్మతో పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన కోహ్లి పెళ్లిని రద్దు చేసుకుని వెంటనే రావాలంటూ అభిమానులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, బాబూ విరాట్‌.. నువ్వు ఎక్కడ ఉన్న వెంటనే టీమ్‌తో వచ్చి చేరు, ఈ ఓటమిని మేం తట్టుకోలేకపోతున్నాం, వెంటనే జట్టుతో చేరి శ్రీలంకపై గెలిచి ప్రతీకారం తీర్చుకోండి.. అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంకా కొందరైతే.. విరాట్‌ కోహ్లి అనుష్క శర్మతో తన పెళ్లిని రద్దు చేసుకుని మరీ ఇండియాకు వచ్చాడు, శ్రీలంకతో జరిగే నెక్ట్స్‌ వన్డే మ్యాచ్‌ ఆడుతాడు.. అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రైతే.. కోహ్లీ, అనుష్కల పెళ్లికి ఆహ్వానం అంద‌క పోవ‌డం వ‌ల్లే టీమిండియా బ్యాటింగ్ చేయ‌కూడద‌ని నిర్ణ‌యించుకుంద‌ని, కోహ్లీ లేకుండా అనుష్కే కాదు.. టీమిండియా కూడా బ‌త‌క‌లేద‌ని రాశారు. ”విరాట్‌.. పెళ్లి క్యాన్సిల్ చేసుకుని త‌ర్వాతి మ్యాచ్ స‌మ‌యానికి రిపోర్ట్ చేయ్‌: టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి ఆదేశం”, ”విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల పెళ్లి వాయిదా ప‌డింది. సాయంత్ర‌మే ఇటలీ నుంచి తిరిగి రానున్న‌ కోహ్లీ”.. వంటి జోకులు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లి రద్దు అనే ఫేక్‌ న్యూస్‌ కాస్తా విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఇక పెళ్లి ఎలాగూ జరిగిపోయింది కనుక, ఇప్పుడు చేసేదేం లేదు కదా..!

Comments

comments

Share this post

scroll to top