ఒక్కసారి ఈ గొంతు వినండి..కోకిలమ్మే కదా.!

ఈ గాయకురాలు పాడిన పాట ను ఓ సారి వినండి. చికాకుగా ఉన్న మనసును ఒక్కసారిగా తేలికపరుస్తుంది. తెలియకుండానే లోపల నుండి అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది. గందరగోళంగా కనిపింస్తున్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా  పసిపాప నవ్వులాగా  హాయిగా అనిపిస్తుంది.  పాటకున్న శక్తే ఇది కదా.!  హే..హూ…హా..అంటూ అర్ధం పర్థంలేని సాహిత్యాన్ని తారుడబ్బా సంగీతాన్ని మనమీదకు వదులుతున్న ఇప్పటి పాటలకూ….మనస్సును ప్రశాంతతను ప్రసాదించే ఆ పాటలకు ఉన్న తేడానే అది. ఈ గాయకురాలి పాట విన్నాక, ఆమె వెనుకున్న బహుమతులు తక్కువే అనిపిస్తుంది.

Watch Song( Wait 3 Sec For Video To Load): 

 

Song Full Lyrics:

విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా(2)

మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయ చేసినది

ఝుమ్మంది నాదం రతివేదం
జత కోరే భ్రమల రాగం
రమ్మంది మోహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహినీ ప్రవించే ఈ వని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడే చెలి కాంతుడై దరిచేరె మెల్లగా..

ఋతువు మహిమేమో విరితేనె
జడి వానై కురిసే తీయగా
లతలు పెనవేయ మైమరచి
మురిసేను తరువు హాయిగా
రాచిలక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడే సుకుమారుడై జతకూడె మాయగా.

 

Comments

comments

Share this post

scroll to top