7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు + అర్జున అవార్డ్ గ్ర‌హీత‌….అయినా సొంతిల్లు లేదు.! ఎందుకీ వివ‌క్ష‌.!?

7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు సాధించాడు… 2015 లో భార‌త ప్ర‌భుత్వం అర్జున అవార్డ్ ను ఇచ్చి గౌర‌వించింది…అయినా ఇప్ప‌టికి కూడా అత‌నికి సొంతిళ్లు లేదు! క్రికెట్ మ‌త‌మైన చోట., అత‌ని ఆట దేనికీ ప‌నికిరాకుండా పోయింది. ఒలంపిక్స్ లో ఓ ర‌జ‌త ప‌త‌కం తెస్తేనే సింధూ ఫేట్ మారిపోయింది.., కోట్ల రూపాయ‌ల‌తో పాటు గ్రూప్-1 జాబ్ ద‌క్కింది.! కానీ 7 అంత‌ర్జాతీయ ప‌త‌కాలు సాధించిన అత‌ను మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయాడు.! ఆట‌నే న‌మ్ముకున్న అత‌ను అక్క‌డే ఆగిపోయాడు. అత‌నే వీరేంద‌ర్ సింగ్ The Mute Wrestler పేరుతో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాధించుకున్న ఓ రెజ్ల‌ర్.

హ‌ర్యాన రాష్ట్రంలోని స‌స్రోలి గ్రామంలో జ‌న్మించిన వీరేంద‌ర్ పుట్ట‌క‌తోనే మూగ‌, చెవిటి… అయిన‌ప్ప‌టికీ వారి కుల సాంప్ర‌దాయ‌మైన కుస్తీనే కెరీర్ గా ఎంచుకున్నాడు. తండ్రి, మామ‌య్యల‌ కోచింగ్ స‌హాయంతో 2002 లో జ‌ర‌గ‌బోయే వ‌ర‌ల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియ‌న్ షిప్ కు స‌న్నాహ‌క మ్యాచ్స్ అయిన నేష‌న‌ల్ రౌండ్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు… ఇక్క‌డ గోల్డ్ మెడ‌ల్ సాధిస్తే డైరెక్ట్ గా వ‌ర‌ల్డ్ మ్యాచ్స్ కు ఎంట్రీ అవ్వొచ్చు…కానీ వీరేంద‌ర్ చెవిటి వాడ‌నే కార‌ణంతో…అత‌న‌ని తొల‌గించి అత‌ని స్థానంలో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన వ్య‌క్తిని రెజ్లింగ్ పోటీల‌కు పంపారు.

ఆ సంఘ‌ట‌న‌తో నిరాశ‌లో కుంగిపోయిన వీరేంద‌ర్ కు 2005 లో మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. మెల్ బోర్న్ లో డెఫ్లీఒలంపిక్స్ జ‌రుగుతున్నాయ‌ని తెలిసి అందులో పాల్గొని గోల్డ్ మెడ‌ల్ సాధించాడు…. అలా 2008, 2009, 2012,2013 సంవ‌త్స‌రాల‌లో…. మొత్తం 4 గోల్డ్ , 3 సిల్వ‌ర్ మెడ‌ల్స్ సాధించి త‌న స‌త్తా చాటాడు. అంత‌ర్జాతీయ వేదిక పై ఇండియా పేరు మారుమోగించాడు. ఇన్నీ సాధించినా ఇప్ప‌టికీ అత‌నికి సొంతిళ్లు లేదు. ఆట మెరుగుకు స‌రైన స‌దుపాయాలు లేవు..ప్రోత్సాహ‌కాలు లేవు. ఎందుకంటే మ‌న దృష్టి క్రికెట్ ను దాటి బ‌య‌టికి పోదు..ఒక‌వేళ పోయినా రెజ్లింగ్ వ‌ర‌కు వెళ్ల‌దు…వెళ్లినా..అందులో విక‌లాంగుల రెజ్లింగ్ వ‌ర‌కు అస‌లే వెళ్ల‌దు.!!

Comments

comments

Share this post

scroll to top