ఈ వీడియో మనదేశంలో పిల్లలకు చదువును నేర్పించే విధానానికి అద్దం పడుతుంది.! చదువు రాకుంటే ఎందుకు పనికిరాని వాడిగా ట్రీట్ చేసే ఈ సమాజంలో, మూడేళ్ళ వయస్సులో……1,2,3 లు రాకపోతేనే ఇక వాడికి ప్యూచరే లేదన్న రీతిలో….A,B,C,D లు నేర్వకపోతే వాడు బతకడమే వేస్ట్ అన్న రీతిలో సమాజం ఎటో దూసుకెళుతుంది. !!చదువు పేరుతో తెలియని భారాన్ని పసిపిల్లపై మోపుతున్న కార్పోరేట్ సంస్కృతికి …ఇలాంటి తల్లిదండ్రులు తోడవ్వడం వల్లే…రేపటి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు….ఆత్మహత్యలు చేసుకుంటూ అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.
watch video here:
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈవీడియోపై …ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ సైతం స్పందించాడు.ఫ్యార్ సే పడావో ( ప్రేమతో చదివించండి) అని తనలోని ఫీలింగ్ ను బయటపెట్టాడు.! 3 ఏళ్ళ అమ్మాయిని పట్టుకొని ఓ తల్లి 1,2,3 లు నేర్పిన విధానం చూస్తుంటే…..ఎవ్వరికైనా గుండె తరుక్కుపోతుంది.! ఆ పసిపాప ప్రాధేయపడుతున్న విధానం చూసి మన విద్యావ్యవస్థపై మనకే అసహ్యమేస్తుంది.! లర్నింగ్ బై డూయింగ్ అంటూ ఆటపాటలతో, చిన్న చిన్న కృత్యాలతో చదువులు నేర్పుతూ పక్కదేశాలు దూసుకుపోతుంటే…బట్టీ పట్టించే విధానాన్ని ఇంకా ఫాలో అవుతూ..ఇదిగో పసిపిల్లలను ఏడ్పించే చదువులను ఇంకా మనం కొనసాగిస్తున్నాం.
తాజాగా బాలీవుడ్ సింగర్స్ తోషి, షరీబ్ సాబ్రిల మేనకోడలే ఈ చిన్నారి అని తేలింది. తన అంకుల్‌తో చిన్నారి హయా ఆడుకుంటున్నట్టు షాబ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా ఉంది. సింగర్ తోషిని మీడియా ప్రతినిధులు సంప్రదించగా… ఈ వీడియోను వాట్సప్‌లో పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్కోసం ఆమె తల్లే చిత్రీకరించినట్టు చెప్పారు. తమకు, పాప తండ్రికి చూపించేందుకే ఆమె ఈ వీడియో తీసిందనీ.. అది అందరూ షేర్ చేసుకోవడానికి కాదని పేర్కొన్నారు.
వైరల్ అయిన ఈ వీడియోపై గాయకుడు తోషీ సబ్రీ స్పందిస్తూ.. హయా చాలా మొండిదని, ఎంత చెప్పినా చదువుకోదని, అందుకే ఆమె తల్లి ఇలా బలవంతంగా నేర్పిస్తున్నదని వివరించాడు. ‘మా పాప గురించి మాకు బాగా తెలుసు. ఎంత తిట్టినా హయా చదువుకోదు. మరుక్షణమే ఆడటానికి పరిగెత్తుకు వెళ్తుంది. అందుకే తను కొంతసేపైనా చదువుకొనేలా చూస్తాం’ అని తోషి చెప్పాడు.
‘‘విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లకు మా గురించి తెలియదు. మా పిల్లల గురించి మాకు తెలుసు. హయా జగమొండి. చదువుకోమని ఎంత చెప్పినా మాటవినదు. ఎంత తిట్టినా ఆ కాసేపు ఏడుస్తూ కూర్చుని మరుక్షణం ఆడుకోవడానికి పరుగెడుతుంది. గద్దించపోతే ఆ మాత్రం కూడా చదువుకోదు…’’ అని పేర్కొన్నారు. చిన్న వీడియో చూసి ఓ తల్లికి తన బిడ్డమీద ఉన్న ప్రేమను ప్రశ్నించడం సరికాదన్నారు. ‘‘పిల్లల్నిపెంచడం అంత తేలికేంకాదు.. వారు అల్లరిచేసినంత మాత్రాన చదువు చెప్పకుండా మానేస్తామా?’’ అని తోషి ప్రశ్నించారు.