న్యూజిలాండ్ తో జ‌రిగిన టీ20లో “వాకీ టాకీ” వాడిన కోహ్లి. దానికి ఐసీసీ ఏం చేసిందో తెలుసా..?

ఈ మ‌ధ్యే ఇండియాకు, న్యూజిలాండ్ జట్టుకు మ‌ధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో తొలి టీ20 మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అందులో భార‌త్ న్యూజిలాండ్ జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్ సంద‌ర్భంగా భార‌త ఆట‌గాడు ఆశిష్ నెహ్రా త‌న సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. స‌హ‌చ‌రులు అత‌నికి ఘ‌న‌మైన వీడ్కోలు ప‌లికారు. అయితే అదే మ్యాచ్‌లో జ‌రిగిన‌ ఓ సంఘ‌ట‌న‌ క్రికెట్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అదేమిటంటే… భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆ మ్యాచ్‌లో వాకీ టాకీలో మాట్లాడాడు. అత‌ను వాకీ టాకీ లో మాట్లాడుతున్న‌ప్పుడు కెమెరాలు ప‌దే ప‌దే అత‌న్ని చూపించాయి. దీంతో అత‌ను మ్యాచ్‌లో వాకీ టాకీ ఎందుకు వాడాడు ? అస‌లు దాన్ని వాడ‌వ‌చ్చా ? అనే సందేహాలు చాలా మందికి క‌లిగాయి.

కాగా కోహ్లి అలా మ్యాచ్‌లో వాకీ టాకీలో మాట్లాడ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. కానీ విరాట్ చేసింది త‌ప్పేమీ కాదంటూ ఐసీసీ అత‌నికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో వాకీ టాకీలో మాట్లాడ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని అన్న వారంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. అయితే ఇంత‌కీ అస‌లు ఇందులో ఐసీసీ నిబంధ‌న‌లు ఏమి చెబుతున్నాయి ? అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

ఐసీసీ రూల్ ప్ర‌కారం… ఏ దేశ‌మైనా ఆడే అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ (టెస్ట్‌, వ‌న్డే, టీ20 ఏదైనా) లో ఎలాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను ప్లేయ‌ర్స్ వాడ‌కూడ‌దు. ఇది ఐసీసీ రూల్‌బుక్‌లో ఉంది. రూల్ బుక్‌లోని 42.12 నిబంధ‌న ప్ర‌కారం ఇది అమ‌ల‌వుతుంది. అయితే ఇందులో వాకీ టాకీల‌కు మినహాయింపు ఉంది. ఎందుకంటే వాకీ టాకీల‌ను కేవ‌లం కొంత ప‌రిమిత దూరంలోనే వాడుకునేందుకు వీలుంటుంది. అది కూడా వాటికి ఫోన్ ల‌కు ఉన్న‌ట్టు నంబ‌ర్లు ఉండ‌వు. క‌నుక వాటికి బ‌య‌టి వ్య‌క్తులు కాంటాక్ట్ అయ్యే అవ‌కాశం లేదు. ఈ క్ర‌మంలో వాకీ టాకీలు గ్రౌండ్‌లో ఉన్న ప్లేయ‌ర్స్‌కు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్లేయ‌ర్స్‌కు మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ ప‌రంగా బాగా ప‌నికొస్తాయి. క‌నుక‌నే వాటికి రూల్ బుక్ నుంచి మిన‌హాయింపునిచ్చారు. ఇక మొన్న జ‌రిగిన మ్యాచ్ లో కోహ్లి ముందుగా ప‌ర్మిష‌న్ తీసుకునే వాకీ టాకీల‌ను ఉప‌యోగించాడు. అందుకనే ఐసీసీ అత‌న్ని ఏమీ అన‌లేదు. క్లీన్ చిట్ ఇచ్చింది. జ‌రిగిన విష‌యం అది..! కానీ దీన్ని కొన్ని మీడియా చాన‌ళ్లు ప‌దే ప‌దే ప్ర‌సారం చేయ‌డంతో ఈ విషయం వైర‌ల్ అయింది..!

Comments

comments

Share this post

scroll to top