ఇండియాలో క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేదు. ఏదైనా మ్యాచ్ జరుగుతుందంటే చాలు, అన్ని పనులు మానేసి టీవీలు, స్మార్ట్ ఫోన్లలో మునిగి తేలిపోతారు. ఇక క్రికెటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారంతా ఇపుడు యూత్‌కు , క్రికెట్ ఫ్యాన్స్ గాడ్ ఫాదర్స్. ఒక్కోరిది ఒక్కో పిచ్చి. ఎప్పుడైతే 1983లో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ తీసుకు వచ్చాడో అప్పటి నుంచి ఈ ఆటకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా క్రికెట్టే దర్శనమిస్తోంది. తుపాను వచ్చినా, భూకంపం సంభవించినా, సునామీ చుట్టు ముట్టినా..ఊళ్లు మునిగి పోయినా ..వరదలు ముంచెత్తినా సరే..క్రికెట్ ను చూడకుండా ఎవరూ ఉండలేక పోతున్నారు. అంతలా పాపులర్ అయిపోయింది ఈ ఆట. ఈ దేశంలో తిండి లేకపోయినా పర్వాలేదు కానీ స్మార్ట్ ఫోన్లు లేకుంటే చచ్చేందుకు సైతం రెడీ అంటున్నారు.
ఓ వైపు సెల్ఫీలు..మరో వైపు జల్సాలు..ఇంకో వైపు బెట్టింగులు ..ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లను దాటింది క్రికెట్ వ్యాపారం. ఒక్కో క్రికెటర్ ఆదాయం ఇపుడు బిలియన్ డాలర్లను దాటేసింది. ఎవరికి వారు ఆటను ఆటగా చూడడం లేదు. టీంలోకి వచ్చామా అన్నది ముఖ్యం కాదు. అప్పటి దాకా ఓ ఎత్తు..ఇక ఒక్కసారి టీమిండియాలోకి ఎంటరైతే చాలు..కార్పొరేట్ కంపెనీలు తీసేసుకుంటాయి. కోట్లాది రూపాయలు గుమ్మరిస్తాయి. వీరికున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లకు చేరుకున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటున్నారు మన క్రికెటర్లు. ఆట ఆడితే ఓ ఫీజు..కంపెనీల యాడ్స్ లో నటిస్తే భారీగా ప్రాఫిట్ దక్కుతోంది. ఒక్కో క్రికెటర్‌ది ఒక్కో స్లయిల్. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ వీరితో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మరికొన్ని ట్రై చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం ఆర్జిస్తున్నక్రికెటర్గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించారు.
ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు కోటి రూపాయలకు పైగానే తీసుకుంటున్నాడట. టీమిండియా సారథి రికార్డులను బ్రేక్ చేయడమేకాదు బ్రాండ్లకు రారాజుగా వెలుగొందుతున్నాడు. పలు వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరహిస్తున్నాడు. సోషల్ మీడియాలో హయ్యస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిని 38.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. తాను వేటికైతే ప్రచారం చేస్తున్నాడో వాటి గురించి ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ ఉంటాడు. ఒక్కో పోస్టుకు 1.35 కోట్లు వసూలు చేస్తున్నాడని హోపర్ హెచ్‌క్యూ అనే ఇన్ స్టా గ్రామ్ షెడ్యూలింగ్ టూల్ పేర్కొంది. ఈ మేరకు అది విడుదల చేసిన జాబితాలో మనోడు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ మీడియా ద్వారా భారీగా ఆదాయం పొందుతున్న ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లి మాత్రమే. పోర్చుగల్ ఫుట్‌బాలర్ రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా. అతను ఒక్కో పోస్టుకు 6.73 కోట్లు ఆర్జిస్తున్నాడు. తర్వాతి స్థానాల్లో నెయ్మార్, మెస్సీ, డేవిడ్ బెకారామ్, లిబ్రాన్ జేమ్స్, రొనాల్డినో, గారెట్ బాలే, లాటన్, లూయిస్ సారేజ్ లు ఉన్నారు.