విరుష్క రిసెప్షన్ విందు బడ్జెట్ ఎంతో తెలుసా…? ఎన్ని రకాల వంటలో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మల పెళ్లి కుటుంబ సభ్యులు మధ్య ఇటీవలే జరిగింది.. డిసెంబర్లో పెళ్లి అని అన్నారు కానీ నిజమో కాదో స్ఫష్టంగా తెలియకముందే విరుష్కల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది..ఫోటోలు చూశాకా కూడా చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు.. కేవలం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఇంటలీలోని టస్కలీలో విరాట్,అనుష్క ఒక్కటయ్యారు.. హనీమూన్ కూడా అక్కడే పూర్తి చేసుకుని వచ్చిన విరుష్క..ఢిల్లీలో గ్రాంఢ్ గా రిసెఫ్షన్ ఏర్పాటు చేశారు..

తమ సన్నిహితులకు, కుటుంబానికి, స్నేహితులకు  పార్టి ఇవ్వనున్న విరుష్క.. ప్రధాని మోడిని కలిసి  వివాహ విందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ విరాట్ దంపతులను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది…అయితే ఈ వేడుక ఏర్పాట్లే ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి..దీని కొరకు చేసే ఖర్చు ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.అంత ఖర్చు పెట్టి ఏమేం చేయబోతున్నారంటే…ఈ విందులో పాల్గొన బోయే వారికి దాదాపు 164 రకాల రుచులను వడ్డించనున్నారు.

https://twitter.com/ViratCrew/status/943736336548225024

ఈ ఫంక్షన్ కి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ పనులన్నింటిని విరాట్ కోహ్లి పెద్దనాన్న దగ్గరుండి చూసుకున్నారు.. అతిధులకు ఇచ్చే మర్యాద ఏ మాత్రం తగ్గకుండా చూడాలని పక్కా పగడ్బందీగా ప్లాన్ చేశారు.. కాగా, ఈ విందుకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తునట్టు సమాచారం…అవును మరీ మూమూలు ప్రజలే పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని ఆరాటపడుతుంటే ఒక దేశానికి చెందిని క్రికెట్ కెప్టెన్,బాలివుడ్ స్టార్ హీరోయిన్ లపెళ్లి అంటే మామూలు విషయం కాదు..కదా…

Comments

comments

Share this post

scroll to top