“మిథాలీ రాజ్” కు కంగ్రాట్స్ చెప్దామనుకున్నాడు..! ఇంతలో ఆ తప్పు చేసి అందరికి అడ్డంగా దొరికిపోయాడు!

భారత మహిళా క్రికెట్ కి ఇటీవలి కాలంలో ఎంత క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంట. సారధిగా మిథాలీ రాజ్ జట్టుకు విజయాలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంది. తనకి తోడుగా “స్మ్రితి మందాన” బాటింగ్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. వరల్డ్ కప్ రేస్ లో ముందంజలో దూసుకుపోతుంది మిథాలీ సైన్యం. ఈ క్రమంలో ఓ ప్రపంచ రికార్డ్ సృష్టించింది.

వన్ డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మహిళా క్రికెటర్ మిథాలీ. మహిళా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో..34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈఘనత సాధించింది. ఈమ్యాచ్ కంటే ముందు 5959 పరుగులతో రెండో స్థానంలో ఉన్న మిథాలీ.. తాజాగా 5992 పరుగులతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్ పేరిట ఉన్న రికార్డ్ ను బద్దలుకొట్టి మొదటిస్థానానికి చేరింది. అంతేకాదు ఎడ్వర్డ్ కంటే తక్కువ మ్యాచుల్లోనే ఈఘనత సాధించింది మిథాలీ.

అభిమానులందరూ సోషల్ మీడియా ద్వారా మిథాలీకి ప్రశంసలు అందిస్తున్నారు. సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. భారత కెప్టెన్ “విరాట్ కోహ్లీ” కూడా తన ఆఫిసిఅల్ ఫేస్బుక్ ద్వారా ఓ పోస్ట్ చేసారు. అందులో “మిథాలీ రాజ్” కు కంగ్రాట్స్ తెలిపారు. కానీ ఆ పోస్ట్ వివాదాస్పంగా మారింది. ఎందుకంటే పోస్ట్ లోని ఫొటోలో “మిథాలీ రాజ్” కు బదులుగా “పూనమ్ రౌత్” ఫోటో పెట్టాడు. అభిమానులు కామెంట్స్ చేసేసరికి ఆ పోస్ట్ డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది!

Comments

comments

Share this post

scroll to top