డిసెంబర్ లో పెళ్లి అనే వార్త నిజమో కాదో అనుకుంటూ ఉండగా…ఇంత ట్విస్ట్ ఇచ్చారేంటి “విరుష్క”..!

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మల పెళ్లి కుటుంబ సభ్యలు మధ్య ఈ రోజే(డిసెంబర్-11) జరిగింది. పెళ్లి జరిగనట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతున్న విషయం తెలసిందే. అయితే పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని, ఇందుకుసంబధించిన ఫోటోను ట్విట్టర్ ద్వారా విరుష్క సన్నిత వర్గాలు తెలిపాయి.

అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది.

ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పెళ్లి తర్వాత డిసెంబర్‌ 21న ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు. అయితే పెళ్లికి షారుఖ్‌ ఖాన్‌, అమిర్, సచిన్‌, యువరాజ్‌ లను ఆహ్వానించారని, వారు ఈ వేడుకలో హాజరవుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజాలు కావని తేలిపోయింది.

Comments

comments

Share this post

scroll to top