వినోదం ఇక విషాదమే ..! భారం కానున్న వీక్ష‌ణం.!!

ఒక‌టి కొంటే ఇంకొక‌టి ఫ్రీ. ఒక చీర కొనుగోలు చేస్తే రెండు చీర‌లు ఫ్రీ. ఒక మొబైల్ కొంటే ఇంకో మొబైల్ ఫ్రీ. మా వ‌ద్ద ఇంటి సామాన్లు కొంటే కారు ఫ్రీ..కంప్యూటర్లు, ల్యాప్ టాపులు ..టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఇలా ప్ర‌తి చోటా ప్ర‌క‌ట‌న‌లు..ఆక‌ర్షించే క‌టౌట్లు. దీని కోసం హీరో హీరోయిన్ల ప్రారంభోత్స‌వాలు. గిఫ్ట్ కూప‌న్లు, వోచ‌ర్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తిదీ వ్యాపార‌మే. అన్నింటిని న‌డిపిస్తున్న‌ది..న‌డిపించేది ఒక్క‌టే వినోదం. ఓ వైపు ఎంట‌ర్ టైన్ మెంట్ అన్న‌ది కీల‌క‌మైన రంగంగా మారింది. అది చూస్తే చిన్న తెర‌..కానీ కోట్లాది రూపాయ‌ల ఆదాయం అందిస్తోంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రు దాని వెంటే ప‌డుతున్నారు.

పొద్దున లేచి న‌ప్ప‌టి నుండి రాత్రి ప‌డుకునే దాకా వంద‌ల ఛాన‌ల్లు..లెక్క‌లేన‌న్ని ప్ర‌క‌ట‌న‌లు..వ‌ద్దంటే వ‌చ్చే యాడ్స్..ముద్దుగుమ్మ‌లు..స్నానాలు..ప‌ర్ ఫ్యూంలు..పౌడ‌ర్లు, స‌బ్బులు, పేస్ట్‌లు, బ్ర‌ష్‌లు..వెహికిల్స్‌..ఇలా సూది పిన్ను నుండి విమానాల దాకా అన్నీ ఆన్ లోన్‌లో దొరుకుతున్నాయి.
వీటిని కొనిపించేలా వినోద రంగం చేస్తోంది. తాగేందుకు నీళ్లుండ‌వు..చేసేందుకు ప‌ని ఉండ‌దు..కానీ ప్ర‌తి కుటుంబంలో టీవీ మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఒక‌ప్పుడు 50 రూపాయ‌లు ఉండేది..కొన్ని ఛాన‌ల్స్ వ‌చ్చేవి. ఇపుడు ఆ స్థితి మారింది.

ఈ వ్యాపారం తెలుగు రాష్ట్రాల‌ను దాటుకుని సౌత్ ఇండియాను విస్త‌రించింది. ముంబ‌యి కేంద్రంగా మాఫియా క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంది కేబుల్ వ్యాపారం. మీడియా విజ‌న్, సిటీ కేబుల్, హాత్ వే, డిజిట‌ల్ మీడియా ఇలా లెక్క‌లేన‌న్ని కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్స్ రంగంలోకి దిగారు. ఇరు రాష్ట్రాల‌లో మాత్రం హాత్ వే దే హ‌వా. దీనికి రాజ‌శేఖ‌ర్ ఉండే వారు. ఇపుడు ఉన్నారో తెలియ‌దు. ఎయిర్ టెల్, డిష్ , విడియోకాన్, టాటా స్కై లాంటివి ప్యాకేజీల‌తో ఆక‌ట్టుకుంటున్నాయి. సామాన్య‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంతా కేబుల్ క‌నెక్ష‌న్ల‌పైనే ఆధార‌ప‌డ్డారు. వారు చూపించేవే చూడాలి. కేబుల్ ఆప‌రేట‌ర్ల వ్య‌వ‌స్థ ఆక్టోప‌స్ లా విస్త‌రించుకు పోయింది. వాళ్లు ఎంత రేటు చెబితే అంత‌.

ఏమ‌న్న అంటే క‌నెక్ష‌న్ క‌ట్. ఫ‌స్ట్ క‌ల్లా ఇంటి ముందు బిల్లుల కోసం క్యూ. లేదంటే క‌నెక్ష‌న్ బంద్. దీని వ్యాపారం మూడు పూలు ఆరు కాయ‌లుగా విరాజిల్లుతోంది. దీని వెనుక భారీ రాజ‌కీయం దాగి ఉంది. పొలిటిక‌ల్ లీడ‌ర్లే కేబుల్ ఆప‌రేట‌ర్లు. వీళ్ల దందాలకు అడ్డులేకుండా పోతోంది. ధ‌ర‌ల మోత‌తో వాయిస్తున్న ఆప‌రేట‌ర్లు మ‌రోసారి జ‌న‌వ‌రి ఒక‌టి నుండి ధ‌ర‌లు పెంచేందుకు రెడీగా ఉన్నారు. కేంద్రం తీసుకున్న ప‌నికిమాలిన నిర్ణ‌యంతో ఇవాళ దేశ వ్యాప్తంగా కేబుల్ ఆప‌రేట‌ర్ల ంతా ఒక రోజు బంద్ పాటిస్తున్నారు.

ఇప్ప‌టికే ఎలాంటి ఆదాయం లేకున్నా బ‌తుకుతున్నా ప‌ట్టించు కోవాల్సిన స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌హ‌రిస్తోంది. కేబుల్ ఆప‌రేట‌ర్ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక పోవ‌డం కూడా మ‌రో కార‌ణం. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం నెత్తిన బండ వేసింది. టీవీల‌కు అతుక్కు పోయే వారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారే ఎక్కువ‌. న్యూస్ ఛాన‌ల్స్, ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానల్స్,స్పోర్ట్స్, మ్యూజిక్, కామెడీ ఛాన‌ల్ ఉన్నాయి. నెల నెలా బిల్లు 200 రూపాయ‌ల నుండి ఏకంగా 800 రూపాయ‌ల‌కు పెంచుతూ కేంద్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై జీఎస్టీ పెంచింది.

జ‌న‌వ‌రి 1 నుండి నూత‌న విధానం అమ‌లు చేస్తోంది. 100 ఉచిత ఛాన‌ళ్ల‌కు 130 రూపాయ‌లు , జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆపై అన్ని ఛాన‌ల్స్ కు విడి విడిగా చెల్లించాలి. డీటీహెచ్ త‌రహా లోనే కేబుల్ ప్ర‌సారాలు కానున్నాయి. పెయిడ్ ఛాన‌ల్‌కు గ‌రిష్టంగా 19 రూపాయ‌ల వ‌డ్డింపు. టీవీ అంటే నెల‌కు 200 లేదా 300 ఇచ్చి చాన‌ళ్లు చూసే వాళ్లం. ఇపుడు ఆ సీన్ మారింది. సెట్ అప్ బాక్సులు ఏర్పాటు చేసాక‌..ఎవ‌రు ఎన్ని ఛాన‌ల్స్ చూస్తున్నారు అనే దానిలో లెక్క రావ‌డంతో డిమాండ్ మేర‌కు చాన‌ళ్ల‌ను ఉచితంగా ఇస్తున్నారు.

ప్ర‌తి నెలా వ‌సూలు చేస్తున్నారు. నెలంతా చూశాక కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు డ‌బ్బులు ఇచ్చే వాళ్లం. డీటీహెచ్ సంస్థ‌లు డిజిట‌ల్ రూపంలో ప్ర‌సారం చేస్తున్నాయి. ఇక కేబుల్ టీవీ క‌నెక్ష‌న్ తీసుకోవాల‌నే వారు ప్రీ పెయిడ్ ప‌ద్ధ‌తిలోనే చెల్లించాల్సి ఉంటుంది. వేరే చాన‌ల్స్ కావాలంటే అద‌నంగా మ‌రో 200 రూపాయ‌లు చెల్లించాలి. దీని వ‌ల్ల టీవీదారుడికి నెల‌కు 400 నుండి 500 రూపాయ‌లు బొక్క‌. ఏ చాన‌ల్ వ‌స్తుందో రాదో తెలియ‌దు.

ఇప్ప‌టికే కేబుల్ వ్య‌వ‌స్థ కుప్ప కూలి పోయే ద‌శ‌లోకి చేరుకుంది. జ‌న‌వ‌రి నుండే అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 250 రూపాయ‌లు చెల్లిస్తే 400 ఛాన‌ల్స్ అందుబాటులో ఉంచాయి. ఇక వినియోగ‌దారులు కోరుకున్న రీతిలో ఇష్ట‌మైన వాటికే చెల్లిస్తారు. దీని వ‌ల్ల కేబుల్ ఆప‌రేట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోతారు.

ఇందుకోస‌మే త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ దేశ వ్యాప్తంగా కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్ట‌నున్నాయి. వంద‌ల ఛాన‌ల్స్ అందుబాటులో ఉంచినా జ‌నం కేవ‌లం 14 లేదా 15 టీవీ ఛాన‌ల్స్ చూస్తున్నార‌ని ఓ సంస్థ ప్ర‌క‌టించింది. మొత్తం మీద టీవీ, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాలను వీక్షించాలంటే జేబులు గుల్ల కావాల్సిందే. మొత్తంగా చూస్తే ఇక వినోదం విషాదంగా మార‌నుంద‌న్న‌మాట‌.

Comments

comments

Share this post

scroll to top