రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ అనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు ఓ ప్రోఫేసర్.అర నిమిషం ఆలస్యమైందని చెప్పి సొంత కూతురినే పరీక్షా హాల్ లోకి రానివ్వలేదు. తండ్రి నిక్కచ్చితనంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ కూతురు చివరకు నిరాశతో ఇంటిబాట పట్టాల్సొచ్చింది.వివరాల్లోకెళితే, మంగళవారం నాడు లాసెట్-2015 పరీక్ష జరిగింది.ఈ ఎగ్జామ్ కు నిమిషం లేటైనా అనుమతించేది లేదని గతంలోనే అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షకు హైదరాబాద్ లోని నిజాం లా కాలేజ్ ప్రిన్సిపాల్ గాలి వినోద్ కుమార్ రీజనల్ కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన ఆయన కూతురు పరివర్తన ఎగ్జామ్ రాయడానికి వచ్చింది.
కానీ ఆమెకు అలాట్ అయిన సెంటర్ నిజాం కాలేజ్ కు ఒక నిమిషం లేట్ గా వచ్చింది అప్పటికే అక్కడి కళాశాల గేటు మూసేశారు. ఆ సమయంలో ఆమె తండ్రి వినోద్ కుమార్ గేటు వద్దే ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే సిబ్బంది గేట్లేశారు. వచ్చింది కూతురు అయినా వినోద్ కుమార్ ఏమాత్రం తన పట్టు సడలించలేదు. నిమిషం లేటైందిగా పరీక్షకు అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక పరివర్తన ఇంటి బాట పట్టింది.
నిబంధనలు నీటి మూటలైన ఈ రోజుల్లో ఇటువంటి విలువలు గల మనిషికి నిజంగా సలాం …