వినియోగదారులకు భారీగా షాకులు ఇస్తున్న “స్టేట్ బ్యాంకు”..! తెలియకపోతే మోసపోయినట్టే..! అందరికి షేర్ చేయండి!

SBI దేశంలో అతి పెద్ద బ్యాంకు..వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కల్పించకుండా సేవలందిస్తుంది అనే పేరుంది.కానీ నోట్ల రద్దు జరిగినప్పటి నుండి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..ఆ తర్వాత బ్యాంకు లావాదేవిల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్ని కావు..ఎటిఎం నుండి డబ్బులు తీసినా కట్,వేసినా కట్..పరిమిత అమౌంట్ లేకపోయినా కట్ అంటూ ప్రతిదానికి కట్..కట్ .. కట్… చెప్పుకుంటూ పోతే ఆ రూల్స్ అన్ని గుర్తు పెట్టుకోవడం కంటే బ్యాంకు అకౌంట్ మూసేయడం బెటర్ అనే ఆలోచన రాకపోలేదు కొందరికి..అంతలా భయపెట్టారు….

అయితే ఇప్పుడు ఆ రూల్స్ పేరుతోనే అకారణంగా మన అకౌంట్లో డబ్బులు కట్ చేస్తూ వినియోగదారులను భారీగా మోసం చేస్తుంది..  అసలు ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియకుండా వినియోగదారుల అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ చేస్తూ.. అడిగిన వారితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు బ్యాంకు సిబ్బంది.మొన్నీ మధ్య క్రిష్ణ మోహన్ శర్మ అనే వ్యక్తి ఖాతాలో నుంచి 150 రూపాయలు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే అనుమానం వచ్చిన క్రిష్ణ మోహన్‌ శర్మ, తన ఖాతా ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఏ.ఎస్‌.రావు నగర్ బ్రాంచ్‌కి వెళ్లి ఆరా తీశారు.. కానీ బ్యాంకు అధికారులు అతనికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

sbi-atm

దాంతో  క్రిష్ణ మోషన్‌ శర్మ “బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌”కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన బ్యాంక్ అధికారులు అకౌంట్ స్టేట్‌మెంట్‌ కోసం 150 రూపాయలు కట్ చేసినట్లు తెలిపారు. అసలు బ్యాంకు స్టేట్మెంటే తీసుకోలేదని.. ఆ సమయంలో బ్యాంకులోనే లేనని.. అయినా అధికారులు డబ్బులు కట్ చేశారని బాద పడినప్పటికీ..బ్యాంకు అధికారుల నుండి సమాధానం లేదు..బ్యాంకు అధికారుల తీరును రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లిన్నా అతడికి న్యాయం మాత్రం జరుగలేదు. అయితే పట్టువదలని క్రిష్ణమోహన్ కోర్టును ఆశ్రయించాడు. హిడెన్ చార్జీల రూపంలో అర్థం పర్థం లేని చార్జీలను కస్టమర్ల అకౌంట్ల నుండి కట్ చేస్తున్నారని, ఇది తన ఒక్కడి సమస్య కాదని ప్రతి వినియోగదారుడికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయని తన ఆవేదనను వెల్లబుచ్చాడు…మీ అకౌంట్లో అయినా డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయా..కట్ అవుతుంటే దేనికి కట్ అవుతున్నాయి అనేది తెలుసుకోండి..లేదంటే అంతే సంగతి..

Comments

comments

Share this post

scroll to top