ఆంధ్ర తెలంగాణ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో కుమ్ముతున్న రామ్ చరణ్, పోటీ ఉన్నా రికార్డు లు ఖాయం.. వినయ విధేయ రామ స్పెషల్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కుమ్మి పడేస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ లో.

మాస్ ఏ కాదు ఫ్యామిలీస్ ని కూడా :

బోయపాటి సినిమా అనగానే బి,సి సెంటర్స్ వాళ్ళకి పండగే, బోయపాటి సినిమాలో కేవలం మాస్ ఏ కాదు, ఫ్యామిలీస్ ని ఆకట్టుకొనే అంశాలు కూడా మెండుగా ఉంటాయి. సెంటిమెంట్ సీన్స్ కానీ, ఆడవాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే సీన్స్ కానీ చాలా ఎక్కువ. భద్ర నుండి జయ జానకి నాయక వరకు తన ప్రతి సినిమా లో ఫైట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు బోయపాటి. అదే విధంగా వినయ విధేయ రామ సినిమా లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేసాడని సమాచారం.

ఆదిలాబాద్ నుండి అనంతపూర్ వరకు భారీ డిమాండ్ :

వినయ విధేయ రామ సినిమాకు భారీగా టిక్కెట్ల డిమాండ్ ఏర్పడింది. థియేటర్ టికెట్ బుకింగ్స్ ఆన్ లైన్ లో ఓపెన్ చేసిన వెంటనే అమ్ముడుపోతున్నాయి, ముఖ్యంగా బి,సి సెంటర్ లలో అయితే ఎక్స్ట్రా షోస్ ఎన్ని వేసినా నిండిపోతున్నాయి, ఆదిలాబాద్ నుండి అనంతపూర్ వరకు ఈ సంక్రాంతికి మాములుగా కుమ్మడు రామ్ చరణ్. ఈ సినిమాకు మరే సినిమా పోటీలేకుండా ఉండి ఉంటే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్ లో టికెట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ రేట్లు ఎక్కువే ఉన్నా, జనాలు మాత్రం టికెట్స్ బుక్ చేసేసుకుంటున్నారు.

దేవి కాపాడలేకపోయిన, దేవి ని చరణ్ కాపాడాడు :

రంగస్థలం మూవీ కి అదిరిపోయే పాటలు అందించాడు దేవి శ్రీ ప్రసాద్, కానీ వినయ విధేయ రామ పాటలు జనాలను ఆకట్టుకోలేకపోయాయి. రంగస్థలం చిత్రానికి వెన్నుముక్కగా నిలబడ్డ దేవి శ్రీ ప్రసాద్, వినయ విధేయ రామ చిత్రానికి కనీస అవుట్ పుట్ కూడా ఇవ్వలేకపోయాడు, కానీ రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం లో పాటలకు వేసిన డ్యాన్స్ చూస్తే దేవి మ్యూజిక్ ని మర్చిపోతారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహా.

వినయ విధేయ రామ చిత్రం లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించారు, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా లో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహా నటీనటులుగా నటించారు.

 

Comments

comments

Share this post

scroll to top