మాస్ జనాలకు మాత్రమే మామ ఈ ‘వినయ విధేయ రామ ‘ హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

బోయపాటి సినిమాలు అంటే మాస్ జనాలకు పండగే, బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే రేంజ్ లో ఉంటాయి, కొడితే ఎగిరి పడే సీన్స్ అయితే చాలానే ఉంటాయి, వినయ విధేయ రామ చిత్రం లో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కాలం లో ఈ తరహా చిత్రం లో నటించలేదు, బ్రూస్ లీ తరువాత చేసిన ధ్రువ సూపర్ హిట్, ఆ తరువాత వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్, దాంతో వినయ విధేయ రామ చిత్రం మీద అంచనాలు భారీగానే ఉన్నాయ్ జనాల్లో, ముఖ్యంగా మాస్ లో.

సింగల్ స్క్రీన్స్ కు పరిమితమవ్వాల్సిందే :

టీజర్ ట్రైలర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు బోయపాటి, అదే రకంగానే అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ ఈ చిత్రం, నటీ నటుల విషయానికి వస్తే ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు, వివేక్ ఒబెరాయ్ ఈ సినిమా లో విలన్ గా నటించాడు, రక్త చరిత్ర సినిమా తరువాత తెలుగు లో డైరెక్ట్ మూవీ ఇదే వివేక్ ఒబెరాయ్ కి. వివేక్ ఒబెరాయ్ ని పాము కాటేస్తే పాము చనిపోద్ది, ఈ తరహా సీన్స్ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయ్.

హీరో హీరోయిన్…:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇది వరకు తీసిన రచ్చ, నాయక్, ఎవడు తరహా లోని మాస్ సీన్స్ ఏ ఈ సినిమాలో కూడా ఉన్నాయ్, కానీ బోయపాటి స్టైల్ లో మరింత ఎక్కువ మసాలా యాడ్ అయ్యింది, కియారా అద్వానీ తన పాత్ర పరిమితిలో చాలా చక్కగా నటించింది. ఈ సినిమా లో పాటల గురుంచి మాట్లాడకపోడమే మంచిది, రామ్ చరణ్ తన డ్యాన్స్ స్టెప్స్ తో అభిమానులను ఆకట్టుకుంటాడు.

అయితే సినిమా గురుంచి ఒక్క మాట లో చెప్పాలి అంటే ఎబోవ్ యావరేజ్ సినిమా. అభిమానులను, మాస్ జనాలను మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
రామ్ చరణ్
ఆక్షన్ సన్నివేశాలు
ఫైట్స్
ఇంటర్వెల్ సీన్
డాన్స్

మైనస్ పాయింట్స్:
కథతో సంబంధంలేని కొన్ని ఫైట్ సీన్స్
దేవిశ్రీప్రసాద్ సంగీతం
సెకండ్ హాఫ్
స్టోరీ

తెలుగుస్టాప్ రేటింగ్ :3/5

ఫ్యామిలీస్ కి దూరంగా మాస్ కు దెగ్గరగా ఒక సారి చూడదగిన సినిమా.

Comments

comments

Share this post

scroll to top