పీవీ సింధుకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభ‌వం.. ఆమె ప‌ట్ల మిస్ బిహేవ్ చేసిన ఎయిర్‌పోర్టు ఉద్యోగి.!? చివరికి ఏమైంది?

పీవీ సింధు.. ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్. ఈమె గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌రికీ తెలుసు. ఒలంపిక్స్‌లో బ్యాడ్మింట‌న్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించి దేశ ఖ్యాతిని న‌లు దిశ‌లా చాటింది. దీంతో దేశ వ్యాప్తంగానే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఈమెకు మంచి పేరు వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్యే ఈమెకు ఎయిర్‌పోర్టులో ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగి ఆమెతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ విష‌యాన్ని సింధు స్వయంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ నెల 4వ తేదీన సింధు హైద‌రాబాద్ నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్‌లైన్స్ 6E 608 నంబ‌ర్ ఫ్లైట్‌లో బ‌య‌ల్దేరేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే అక్క‌డే ఉన్న ఆ విమాన సంస్థ ఉద్యోగి అజీతేష్ సింధుతో మిస్ బిహేవ్ చేశాడ‌ట‌. ఆమె ప‌ట్ల రూడ్‌గా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. అలా అని చెప్పి సింధు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం కాస్తా వైర‌ల్ అయింది. అయితే సింధు ట్వీట్ ప‌ట్ల స‌ద‌రు విమాన సంస్థ స్పందించింది. వెంట‌నే ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పందించామని, ఆ ఉద్యోగి అలా గ‌న‌క మిస్ బిహేవ్ చేసి ఉంటే వెంట‌నే అత‌నిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సింధుకు వారు ట్విట్ట‌ర్ లో తెలిపారు.

అయితే నిజానికి అస‌లు జరిగింది ఏమిటంటే… విమానంలో బ‌య‌ల్దేరేందుకు వెళ్లిన సింధు ల‌గేజ్ ప‌రిమితి క‌న్నా కొన్ని కేజీలు ఎక్కువ‌గా ఉంద‌ట‌. దీంతో ఆ ఎక్కువ‌గా ఉన్న లగేజీ తీసేసి వెళ్లాల‌ని స‌ద‌రు విమాన సంస్థ ఉద్యోగి సింధుకు చెప్పాడ‌ట‌. దీంతో సింధు అత‌నితో గొడ‌వ ప‌డిందట‌. ఇదీ… అస‌లు జ‌రిగిన విష‌య‌మని మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. అయితే ప్ర‌స్తుతానికి ఈ వివాదం ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి చివ‌ర‌కు ఇందులో ఏం జ‌రుగుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

PV Sindhu Slams Indigo Airlines After A Staff Member Misbehaved With Her And Air Hostess

Comments

comments

Share this post

scroll to top