విమానంలో ఫేస్బుక్ ఓనర్ అక్కకి లైంగిక వేధింపులు..! సిబ్బంది సపోర్ట్ చేయలేదు కానీ ఆమె ఫేస్బుక్ లో పెట్టేసరికి!

లైంగిక వేధింపులకు సామాన్యులు,సెలబ్రిటీలు అనే  తేడా లేదు.అది ఏ చోటైనా సరే, అమ్మాయి అయితే చాలు, కామాంధులకు కొమ్ములు వచ్చేస్తాయి. విచక్షణా రహితంగా లైంగిక దాడికి పాల్పడిపోతారు. ఇటీవల ఫేస్ బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకెర్ బర్గ్ సోదరికి, విమానంలో మూడు గంటల పాటు వేధింపులు ఎదురైనాయి..దానిని ట్విటర్ ద్వారా ఆమె తెలియచేశారు.

UPDATE: I just got off the phone with two executives from Alaska Airlines who informed me that they are conducting an…

Posted by Randi Zuckerberg on Wednesday, 29 November 2017

అలాస్కా ఎయిర్‌ లైన్స్‌‌ ఫ్లైట్ లో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సోదరి రాండీ జుకర్‌ బర్గ్‌‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఫేస్ బుక్ కు మార్కెటింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించే రాండీ జుకర్ బర్గ్, అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ లో మెక్సికోకు వెళ్తున్నారు. అలస్కా ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్న రాండీతో.. ఆమె ముందు సీటులో ఉన్న వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. పదే పదే అదే విధంగా చేయడంతో విసుగెత్తిన ఆమె అక్కడి సిబ్బందితో ఈ విషయం కంప్లైంట్ చేశారు..అతను తమకు రెగులర్ కస్టమర్ అని చెబుతూ, అతను అడిగినంత మద్యాన్ని సప్లై చేశారు.. వాళ్లు కూడా అతనికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారని , తననే వేరే సీటులోకి వెళ్లి కూర్చోమన్నారని వాపోయింది. కానీ తను మాత్రం తన సీటులోనే కూర్చున్నానని తెలిపింది.

ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రవర్తన.. ఆ పోకిరీని ప్రోత్సహించినట్టుగానే ఉందని తెలిపింది. అలాంటి వారిపై కఠిన చర్యలు లేకపోతే… ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు తనకు జరిగిన ఘటనను వివరిస్తూ ఎయిర్ లైన్స్ అధికారులకు సుదీర్ఘ లేఖ రాశారు రాండి.లేఖ పై స్పందించిన అలస్కా ఎయిర్ లైన్స్.. దీనిపై విచారణ చేపట్టామని… ఈ ఘటన తమను ఆందోళనకు గురి చేసిందన్నారు.

Comments

comments

Share this post

scroll to top