విమానంలో ఆ మ‌హిళ ప‌ట్ల వృద్ధుడు చాలా చండాలంగా, చెప్పుకోలేని విధంగా ప్ర‌వ‌ర్తించాడు. చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

ఛీ… ఛీ… చాలా చండాలం… నిజంగా అంత‌కు మించిన ప‌దం ఏదైనా ఉంటే అది ఇప్పుడు మేం చెప్ప‌బోయే దానికి వ‌ర్తిస్తుంది. అవును మ‌రి.. విష‌యం అలాంటిది. దాని గురించి చ‌ర్చించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక పాపం ఆ ఘ‌ట‌న‌ను ఎదుర్కొన్న బాధితురాలి ప‌రిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఘ‌ట‌న జ‌రిగింది విమానంలో. హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కిన ఆ మ‌హిళ‌కు ప్ర‌యాణమంతా న‌ర‌కప్రాయం అయింది. నిజంగా ఇలాంటి సంఘ‌ట‌న ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

అది ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. అందులో హైద‌రాబాద్‌కు చెందిన 44 ఏళ్ల ఓ మ‌హిళ ఎక్కింది. ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ర‌మేష్ చంద్ అనే వృద్ధుడు కూడా అదే విమానంలో ఎక్కాడు. వీరిద్ద‌రూ ప‌క్క ప‌క్క‌నే కూర్చున్నారు. అయితే విమానం టేకాఫ్ అవ్వ‌గానే కొంత సేప‌టికి ర‌మేష్ చంద్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు చేయ‌సాగాడు. ఆ మ‌హిళ‌ను చూస్తూ అత‌ను పిచ్చి చేష్ట‌లు, అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌తో మెల‌గ‌సాగాడు. ఆమెతో అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు కూడా మాట్లాడ‌సాగాడు. దీంతో అది తట్టుకోలేని మహిళ విమానంలో ఎయిర్ హోస్టెస్‌కు కంప్లెయింట్ చేసింది. దీంతో ఆమె సీట్ మార్చారు.

అయితే సీట్ మారినా ర‌మేష్ చంద్ బుద్ధి మార‌లేదు. వెంట‌నే చాలా చండాల‌మైన ప‌ని చేశాడు. స‌ద‌రు మ‌హిళ‌ను చూస్తూ హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో ఆ మ‌హిళ మ‌రోమారు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయ‌గా వారు వ‌చ్చి ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంట‌నే అత‌న్ని టాయిలెట్‌కు తీసుకెళ్ల‌గా అత‌ను క్లీన్ చేసుకున్నాడు. ఆ త‌రువాత కూడా విమాన సిబ్బంది రమేష్ చంద్‌ను ప‌ట్టుకుని అత‌నికి కాప‌లా కూర్చున్నారు. రెండు గంట‌ల త‌రువాత విమానం ఢిల్లీకి చేరింది. దీంతో విమాన సిబ్బంది ర‌మేష్ చంద్‌ను స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు. పోలీసులు అత‌నిపై 354ఎ, 509 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. మ‌హిళ‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేయ‌డ‌మే కాక , అస‌భ్య‌కర రీతిలో సైగ‌లు చేయ‌డం, మాట‌లు మాట్లాడ‌డం వంటి ప‌నులు చేసినందుకు గాను అత‌నిపై ఆ కేసులు పెట్టారు. ఇక ఇలాంటి వెధ‌వ‌ల‌ను అసలు ఏం చేస్తే బాగుంటుంది..!

Comments

comments

Share this post

scroll to top