చేతిఖర్చులకు కూడా డబ్బులు లేని నిరుపేద బాలిక..! “లండన్ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటి” కి ఎలా వెళ్లిందో తెలుసా..?

లండ‌న్‌లో ఉండే ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ గురించి మీకు తెలుసుగా..? ప‌్ర‌పంచంలోని టాప్ 10 యూనివ‌ర్సిటీల‌లో ఈ యూనివ‌ర్సిటీ ఒక‌టిగా పేరుగాంచింది. అక్క‌డ విద్య‌న‌భ్య‌సించాల‌ని చాలా మంది విద్యార్థులు క‌ల‌లు కంటుంటారు. కానీ వాటిని కొందరే నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆ బాలిక కూడా ఉంది. అయితే ఆమె పేద కుటుంబం నుంచి రావ‌డం విశేషం. సాధార‌ణంగా ఎంతో క‌ష్ట‌ప‌డి బాగా శ్ర‌మ‌కోర్చి చ‌దివి మంచి మార్కులు తెచ్చుకున్నా బాగా డ‌బ్బులు క‌డితేనే అలాంటి యూనివ‌ర్సిటీలో చ‌దివే భాగ్యం వ‌స్తుంది. కానీ ఆ బాలిక మాత్రం అవ‌లీల‌గా ఆ యూనివ‌ర్సిటీలో ఒక నెల పాటు కోర్సును చ‌దివే భాగ్యం ద‌క్కించుకుంది. ఆమే ఆషా..!

asha-mp

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌న్నా జిల్లాలో ఉండే జ‌న్వార్ గ్రామంలో ఆషా నివాసం ఉంటోంది. వారిది అత్యంత నిరుపేద కుటుంబం. ఒక పూట ప‌నిచేస్తే గాని త‌రువాతి పూట‌కి తిండి దొర‌క‌ని ప‌రిస్థితి వారిది. అయిన‌ప్ప‌టికీ ఆషాకు మాత్రం చ‌దువుకోవాల‌ని బాగా కోరిక‌గా ఉండేది. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాల‌నేది ఆమె ఆశ‌… క‌ల‌..! కానీ వారి కుటుంబ ప‌రిస్థితి కార‌ణంగా చ‌దువు అట‌కెక్కింది. అయితే ఒకానొక ద‌శ‌లో వారి గ్రామంలో ఓ స్వ‌చ్ఛంద సంస్థ వారు వేస‌వి శిక్ష‌ణా శిబిరం నిర్వ‌హించారు. అందులో అనేక అంశాల్లో స్థానిక చిన్నారుల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చారు. ఆ శిబిరంలో ఆషా కూడా పాల్గొంది. ఈ క్ర‌మంలో ఆమెకు ఉన్న ఇంగ్లిష్ నేర్చుకోవాల‌న్న ఆస‌క్తిని స‌ద‌రు స్వ‌చ్ఛంద సంస్థ స‌భ్యులు గ‌మ‌నించారు.

అలా ఆ ఎన్‌జీవో స‌భ్యులు ఆషాకు ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించి అందుకు త‌గిన‌ట్టుగా ప్రోత్సాహం అందించారు. ఆమె స్కూల్‌కు వెళ్లేందుకు స‌హాయం చేశారు. ఈ క్ర‌మంలో ఆమెలో ఉన్న ప్ర‌తిభ‌ను తెలుసుకున్న స‌ద‌రు ఎన్‌జీవో డైరెక్ట‌ర్ ఆమెను స్వ‌యంగా త‌న ఛాంబ‌ర్‌కు పిలిచి ఆమెలో ఉన్న ఇంగ్లిష్ స్కిల్స్‌ను, నేర్చుకోవాల‌నే ఆకాంక్ష‌ను గ‌మ‌నించి ముగ్దురాలైంది. అనంత‌రం ఆమెను లండ‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి పంపించ‌నున్న‌ట్టు చెప్పింది. అందుకు కావ‌ల్సిన వీసా ప‌ని చూస్తామ‌ని ఆమె మాటిచ్చింది. దీంతో ఆషా ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

అయితే లండ‌న్ వెళ్లేందుకు ఆషాకు క‌నీసం చేతి ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు లేవు. దీంతో ఆ గ్రామ‌వాసులే త‌లా ఇన్ని డబ్బులు పోగు చేసి ఆషాకు ఇచ్చారు. వాటితో ఆషా లండ‌న్ వెళ్ల‌నుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే త‌న కోసం ఊరి ప్ర‌జ‌లు చేసిన స‌హాయాన్ని మ‌రిచిపోలేన‌ని, తాను ఇంగ్లిష్ కోర్సు నేర్చుకుని నెల త‌రువాత వ‌చ్చాక త‌న గ్రామంలో ఉన్న పిల్ల‌లంద‌రికీ ఇంగ్లిష్ పాఠాలు చెబుతాన‌ని అంటోంది. ఆమె ఆశ‌, ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top