రేపిస్ట్ ను పోలీసుల ముందే కొట్టి చంపిన గ్రామస్తులు.

కామాందుడిని గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఏలూరు లో కలకలం రేపుతోంది. నిన్న ఏలూరు లో ఏడేళ్ళ బాలిక పై సురేష్ అనే వ్యక్తి అత్యాచారాని కి పాల్పడ్డాడు.  అత్యాచారం తర్వాత ఆ బాలికను హత్య చేసి శవాన్ని ట్రంకు పెట్టె లో పెట్టాడు.

ఈ విషయం  తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడిని నిన్నటి నుండి తీవ్రంగా గాలించారు. ఒక వైపు పోలీసులు నిందితుడి ఆచూకీ కొరకు గాలిస్తుంటే అంతకు మించి గాలింపు చర్యలు చేపట్టారు గ్రామస్తులు.

villagers charge on rapist in yeloor

చివరకు పోలీసులు సురేష్ ను వెంబడించి పట్టుకునే సమయంలో భయంతో పరుగులు తీసిన సురేష్ బ్రిడ్జి నుండి కిందకు దూకాడు. అంత ఎత్తు నుండి కిందికి దూకిన సురేష్ కు గాయాలయ్యాయి, అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

villagers charge on rapist
సురేష్ పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలుసుకున్న గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మూకుమ్మడిగా నిందితుడిపై దాడికి దిగారు గ్రామస్తులు. ఆ దెబ్బలకు సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు అక్కడే ఉన్నా గ్రామస్తుల కోపం ముందు ఏం చేయలేకపోయారు. సురేష్ పై గతంలోనే ఇటువంటి కేసులున్నాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top