గ్యాంగ్ రేప్ కు గురైన మహిళను వివాహం చేసుకొని…ఆమెను ‘లా’ చదివిస్తున్న రైతు.!

ఛంఢీఘర్ లోని ఛాతర్ అనే గ్రామంలో…. కాలేజ్ కు వెళ్లివస్తున్న యువతిని  ట్రాక్ చేసి….నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దేహమంతా రక్కిన గాయాలతో ఆ మహిళ ఏదోలా ఆ మానవమృగాల నుండి బయటపడింది. కామవాంఛతో రగులుతున్న నలుగురు తనపై పశువులా దాడి చేసిన రోజును గుర్తుచేసుకుంటూ… నిద్రలోనే ఉలిక్కిపడేది ఆ అత్యాచార బాధిత మహిళ. ఎలాగైనా వారికి బుద్దిచెప్పాలని…న్యాయపోరాటం మొదలు పెట్టింది. ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు…నాలుగవ వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నారు.    ఆ నాల్గో వ్యక్తి…పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు.

ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు ( జితేందర్) రేప్ కు గురైన మహిళను వివాహం చేసుకుంటానని ముందుకు వచ్చాడు. ఊరందరి సమక్షంలో మనస్పూర్తిగా, గొప్పమనస్సుతో బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ అనంతరం…అతను కూడా తన భార్యకు అండగా నిలబడ్డాడు…తప్పించుకొని తిరుగుతున్న ఆ నాల్గవ వ్యక్తిని పట్టుకోవాలని…ఏకంగా  ఆ రాష్ట్ర CM ఖట్టర్ కు సైతం తమ గోడును వినిపించాడు.

rape

మరోవైపు…తన భార్యకు ఇష్టమైన న్యాయవిద్య( లా) ను చదివిస్తున్నాడు. చట్టాల గురించి సమగ్రంగా  తెలిసినప్పుడే…తన భార్యలాంటి  బాధితులకు మరింత న్యాయం చేయగలుగుతుందని  అతని విశ్వాసం. భార్య స్థాపించిన యూత్ అగెనెస్ట్ రేప్ (Youth Against Rape) అనే స్వచ్చంధ సంస్థ లో కూడా జితేందర్ కీలక పాత్ర పోషిస్తూ….ఆదర్శభర్తగా మన్ననలను పొందుతున్నాడు.

అత్యాచారానికి గురైందంటేనే..ఏదో మైలపడ్డది అనే ఆమె ముఖాన్ని చూడడానికి కూడా కొందరు వెనుకాడుతున్న తరుణంలో…ఓ సామాన్య రైతైన జితేందర్ చూపిన ఆదర్శం అంతా ఇంతా కాదు. హ్యాట్సాఫ్ జితేందర్.

Comments

comments

Share this post

scroll to top