ఒకప్పటి ఈ విలన్ గుర్తున్నారా..? అతని ఇద్దరు కొడుకులు ఇప్పుడక్కడ టాప్ హీరోలని మీకు తెలుసా..?

ఎర్రమందారాలు సినిమా చూసిన వారికి ఆ సినిమాలో అమాయక హీరోగా నటించిన రాజేంద్రప్రసాద్ కంటే ఎక్కువగా గుర్తుండిపోతాడు విలన్..నిజంగా విలన్ అంటే ఇంత భయంకరంగా ఉంటాడా అనేంతలా ఆ పాత్రలో నటించి,భయపెట్టారు దేవరాజ్..ఆ సినిమా తర్వాత ముందు కూడా దేవరాజ్ నెగటివ్ రోల్స్ చాలా చేశారు .కానీ ఎందుకో  కరడుగట్టిన భూస్వామిగా దేవరాజ్ పోషించిన పాత్ర మాత్రం సినిమా చూసాక కూడా కొద్ది రోజులు భయపెడుతుంది.విలన్ గా భయపెట్టిన దేవరాజ్ కి ఇద్దరు కొడుకులున్నారని,వాళ్లిద్దరూ హీరోలని తెలుసా…

దేవరాజు…. సెప్టెంబర్ 20 1953 లో బెంగాళురు లోని లింగరాజ్ పూరంలో రామచంద్రప్పా, కృష్ణమ్మకు జన్మించారు.దేవరాజు చిన్నప్పటి నుంచి స్కూల్ లో, బయట కూడ నాటకలను వేసేవాడు. చిన్నప్పటి నుంచి నాటకలు వేయడం వలన యాక్టింగ్ మీద ఆసక్తి పెరిగింది.దాంతో ఒక రోజు తమిళ డబ్బింగ్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లాడు. అక్కడ సెలక్ట్ అయ్యాడు…… దేవరాజ్ మొదటి 1986లో 27 మావలి సార్కిల్…. ఆ సినిమా కాస్త హిట్ అవ్వడంతో సినిమాల్లో కంటిన్యూ అయ్యారు.అంతకుముందు HMT లో తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగం చేసారు.….కన్నడ, తెలుగు, తమిళంలో కలిపి 200 సినిమాలు చేశారు. దెవరాజ్ కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1991లో దేవరాజ్ నటించిన వీరాప్పన్ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు.టాలీవుడ్ లో 20 వ‌శ‌తాబ్దం, ఎర్ర‌మందారం, య‌జ్ఞం లాంటి సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టుకున్నాడు, దేవరాజ్ యజ్ఞం సినిమాలో తన కూతురుని ఒక పనివాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్ట పడని తండ్రి పాత్ర లో ఎంతో బాగా నటించారు ..

దేవరాజు భార్య చంద్రలేఖ కూడా ఒకప్పటి నటే.వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్ సమయంలో కలవడం,పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.వివాహం తర్వాత చంద్రలేఖ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.వీరికి ఇద్దరు కుమారులున్నారు.వారే ప్రజ్వల్ దేవరాజ్,ప్రణామ్ దేవరాజ్ లు..వీరిద్దరూ కూడా కన్నడ చిత్రసీమలో లీడ్ లో ఉన్న హీరోలు..ప్రజ్వల్ ఇప్పటికే నటుడిగా తన సత్తా చాటారు..ప్రణామ్ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు..

Comments

comments

Share this post

scroll to top