CONFIRMED: “అర్జున్ రెడ్డి” తమిళ్ రీమేక్ లో హీరో ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో కొడుకు..! ఇటీవలే అతను.!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా సరే కథా, కథనం మంచి సంగీతం లేకపోతే సీనీ ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడుతున్నారు. సినిమాలో కథాబలం బాగా ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తున్నారు. ఇది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో అక్షరాల నిజమైంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే.. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. సినిమాకు అనూహ్య స్పందన రావడం.. అటు ఓవర్సీస్ లోనూ భారీగా కలెక్షన్లు రాబట్టడంతో అర్జున్ రెడ్డి సినిమాపై ఇతర భాష దర్శకులు, హీరోలు కన్నువేశారు. ఈ సినిమా తమిళ హక్కులను భారీ మొత్తంలో చెల్లించి ధనుష్ సొంతం చేసుకున్నారు.

‘చియాన్’ విక్రమ్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి స్టార్ హోదా ఉంది. ఆయన నటించిన ‘శివ పుత్రుడు’, ‘అపరిచితుడు’ తెలుగులో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన తాజాగా నటించిన ‘ధ్రువ నక్షత్రం’, ‘స్కెచ్’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఆయన తనయడు ‘ధృవ్’ సినీ రంగప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న ధృవ్ ని ‘అర్జున్ రెడ్డి’ హక్కులను సొంతం చేసుకున్న ధనుష్ సంప్రదించాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది. సో చియాన్ విక్రమ్ తనయుడు అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించబోతున్నారని ఫిలిం వర్గాల టాక్.

Comments

comments

Share this post

scroll to top