బాహుబలి-3 గురించి రాజమౌళి నాన్న విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు.

బాహుబలి పార్ట్ -3 గురించి దర్శకధీరుడు  రాజమౌళి వాళ్ళ  నాన్న విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ సినిమాకు రైటర్ కూడా ఈయనే కావడంతో  ఆన వ్యాఖ్యలు మరింత ఇంట్రస్టింగ్ గా అనిపించాయ్. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ  బాహుబలి-3 కూడా ఉంటుందని కుండబద్దలు కొట్టారు..అయితే బాహుబలి-1, బాహుబలి-2 లతో బాహుబలి 3 కు ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపారు. బాహుబలి కన్క్లూజన్ లో పార్ట్-1 లో మిగిల్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆయన అన్నారు.

బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో …. ‘బాహుబలి’ సీక్వెల్స్ కొనసాగించాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. సినిమాలకు స్క్రిప్ట్ ను అందించడం నా విధి. ప్రస్తుతం 40 స్క్రిప్టులు రెడీ చేస్తున్నాను. ‘ఇదొక నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా నేను రాస్తూనే ఉంటాను. అందులో కొన్ని మాత్రమే వెండి తెరకు వస్తాయి అని చెప్పుకొచ్చారు’ రైటర్ విజయేంద్రప్రసాద్.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top