సైకిల్ అంటే అందరికి తెలిసే ఉంటది.. కానీ వెదురుతో చేసిన సైకిల్ ఎప్పుడైనా చూసారా ??

సైకిల్, ఇది ఏంటో తెలియని వారు ఉండరు ఎక్కని వారు కూడా ఉండరు. కనీసం ఒక్కసారి అయినా ఎక్కి ఉంటారు. అయితే సైకిల్ దేంతో కూడా చేస్తారో తెలిసే ఉంటది. సాధారణంగా అయితే సైకిల్ ని ఉక్కు లేదా అల్యూమినియంతో చేస్తారు. కానీ బెంగుళూరు నగరానికి చెందిన విజయ్ శర్మ అనే వ్యక్తి మాత్రం వెదురుతో సైకిల్ తయారు చేస్తాడు.

విజయ్ శర్మ, ఇతని తండ్రి ఒక కార్పెంటర్, అందుకేనేమో చిన్నప్పటి నుండి అసాధారణ పదార్థాలతో ప్రయోగాలు చేసి ఆసక్తికరమైన ఫలితాలు సాధించేవాడు. తనది తానే తోలుతో స్లిప్పర్లు ఇంకా బ్యాగులు తయారు చేసుకునేవాడు అంతే కాదు వెదురుతో మంచం కూడా చేసుకున్నాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేసేవాడట. 2009 సంవత్సరంలో ఒక ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా వల్ల వెదురుతో సైకిల్ తయారు చేసాడట. సాధారణ సైకిల్ లో ఎక్కడైతే స్టీల్ లేదా అల్యూమినియం ఉంటుందో వాటి స్థానంలో వెదురు వాడతారు. చక్రాలు, హ్యాండిబార్లు, బ్రేక్లు మరియు పెడల్స్ లాంటి భాగాలు మెటల్ తోనే ఉంటాయి.

స్టీల్ లేదా అల్యూమినియం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది. వాటి కోసం గనుల తవ్వకం జరపాలి. ఇంకా వీటి ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది. కానీ వెదురు మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకా బరువు కూడా చాలా తక్కువ దొరుకుతుంది. అంతే కాదు దీంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. విజయ్ శర్మ ఇప్పటి వరకు కేవలం 20 సైకిలు మాత్రమే తయారు చేశారు. వీటిని ఎవ్వరు కోనట్లేదు అని చెప్పి తయారు చెయ్యడం మానేశారు. విజయ్ శర్మ తయారు చేసే సైకిలు సాధారణ సైకిల్ కి ఏం తీసిపోదు. ఈ సైకిల్ కూడా రూ. 15,000-25,000 రేంజ్ మధ్యలో ఉంటుందని సమాచారం.

Comments

comments

Share this post

scroll to top