కమెడియన్ “విజయ్ సాయి” భార్య అసలు పేరు “వనిత” కాదంట…! ఎన్ని పేర్లు మార్చిందో తెలుసా..?

సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ సాయి భార్య పేరు వనిత కాదని, ఆమె అసలు పేరు వరలక్ష్మీ అని పోలీసులు గుర్తించారు. అలాగే వనిత పాస్‌పోర్ట్‌లో ఒక పేరు.. స్కూల్ సర్టిఫికెట్‌లో మరో పేరు ఉందని గుర్తించారు. అంతేగాక వనిత స్కూల్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టులో వేరువేరుగా తండ్రి పేర్లు ఉండడం గమనార్హం.

ఈ కేసులో పలు కోణాల్లో జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉండగా వనిత తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేసిందని, దీంతో రఫీకి విజయ్‌సాయి ఆత్మహత్యతో ఏమైనా సంబంధముందా… అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరికి నోటీసులిచ్చిననంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top