విజయ్ సాయి ఆత్మహత్యపై స్పందించిన వనితారెడ్డి…వివాదాస్పదంగా మారిన ఆమె వ్యాఖ్యలు..!

తమ కుమారుడి ఆత్మహత్యకు అతడి మాజీ భార్య వనితారెడ్డే కారణం అని హాస్యనటుడు విజయ్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వనితతో గొడవల కారణంగానే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. విజయ్ ఆత్మహత్యపై స్పందించింది ఆయన భార్య వనితా రెడ్డి. ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావటం లేదన్నారు. రెండేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తుందన్నారు. ప్రతి వారం పాపని వచ్చి చూసి వెళుతున్నాడన్నారు. ఎన్నో రోజులుగా చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపించింది. విజయ్ కు మరో అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని.. కళ్లారా చూశానని చెప్పారు.

watch video here:


వనితారెడ్డిది సొంతూరు తూర్పు గోదావరి జిల్లాలోని పెడమర్తి. సినిమాల్లో నటిస్తూ విజయ్ సాయితో పరిచయం ఏర్పడ్డాక.. ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే ఓ పాప పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా విజయ్‌తో విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో భరణంగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ‘అబ్బో ఆడవాళ్లు’ చిత్రంలో వనిత కీలక పాత్ర పోషించింది. ‘అనుమానాస్పదం’ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top