9000 కోట్లు కొట్టేసి లండ‌న్‌కు పారిపోయిన విజ‌య్ మాల్యా ఇప్పుడు 3వ పెళ్లికి రెడీ.! ఎవరిని చేసుకుంటున్నాడో తెలుసా.?

విజ‌య్ మాల్యా.. ఇత‌న్ని ఇప్పుడు మ‌న దేశంలో క‌న‌బ‌డితే నిజంగా జ‌నాలు ఏం చేస్తారో తెలియ‌దు కానీ.. అత‌ను మాత్రం ఇప్పుడు లండ‌న్‌లో హాయిగా, జాలీగా కాలం గ‌డుపుతున్నాడు. విలాసాల్లో మునిగి తేలుతున్నాడు. ఎప్పుడూ ఇత‌ను వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. భార‌త్‌లో బ్యాంకుల‌కు రూ.9వేల కోట్లు శ‌ఠ‌గోపం పెట్టి లండ‌న్‌కు పారిపోయిన‌ప్ప‌టి నుంచి అడ‌పా ద‌డ‌పా మాల్యా వార్త‌ల్లో క‌నిపిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా ఇత‌నికి సంబంధించిన ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే…

విజ‌య్ మాల్యాకు ఇప్ప‌టికే ఇద్ద‌రు భార్య‌లు ఉన్నారు క‌దా. త్వ‌ర‌లో ఇంకో మ‌హిళ‌ను అత‌ను పెళ్లి చేసుకోనున్నాడ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఆమె పేరు పింకీ ల‌ల్వానీ అట‌. ఈమె ఒక ఎయిర్ హోస్టెస్‌. గ‌త 3 సంవ‌త్స‌రాల నుంచీ విజ‌య్ మాల్యా వెంటే ఈమె ఉంటున్న‌ద‌ట‌. అత‌నికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌కు ఈమె అత‌నితో క‌ల‌సి హాజ‌ర‌వుతుంద‌ట‌. దీంతో ఇక త్వ‌ర‌లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని తెలిసింది.

మొద‌టి భార్య స‌మీరా త్యాబ్జీ కాగా, రెండో భార్య (ప్ర‌స్తుత భార్య‌) రేఖా మాల్యా. ఇక పింకీ ల‌ల్వానీని పెళ్లి చేసుకుంటే ఆమె అత‌నికి మూడో భార్య అవుతుంది. విజ‌య్ మాల్యా, పింకీ ల‌ల్వానీ ఈ మ‌ధ్య లండ‌న్‌లో ఎక్క‌డ చూసినా జంట‌గా క‌నిపిస్తుండడంతో వీరికి పెళ్లి జ‌రగ‌వ‌చ్చున‌నే పుకార్లు వ‌స్తున్నాయి. అయితే మ‌రి వీటిలో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ మ‌రోసారి విజ‌య్ మాల్యా మాత్రం వార్త‌ల్లోకి ఎక్కాడు. అవును మరి, వార్త‌ల్లో ఎందుకు రాడు. తాను కొట్టేసిన రూ.9వేల కోట్లను ఎంచ‌క్కా లండ‌న్ త‌ర‌లించాడు క‌దా, వాటితో 3వ భార్య‌ను ఏంటీ.. అవ‌స‌రం ఉంటే ఇంకా ఎంత మందినైనా చేసుకుంటాడు. నిజంగా ఇలాంటి వారు మ‌న దేశస్తులు అయినందుకు మ‌నం చింతించాల్సిందే. ఏమంటారు..!

Comments

comments

Share this post

scroll to top