విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు & రాజ‌శేఖ‌ర్ కూతురు… సినిమా షూటింగ్.!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ హీరోగా…రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్ గా దొర‌సాని అనే సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమాకోసం సూర్యాపేట జిల్లాలోని న‌డిగూడెం లో ఉన్న పురాతాన రాజాగారి గ‌డిని ఉప‌యోగిస్తున్నారు. టైటిల్ ప్ర‌కారం చూస్తే….. గ‌డిలో ఉంటున్న దొర‌కూతురికి అదే గ్రామంలో ఉండే ఓ యువ‌కుడికి మ‌ద్య జ‌రిగే ప్రేమ క‌థ‌గా ఈ సినిమా ఉండొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది.

 

మ‌ధుర శ్రీద‌ర్, య‌శ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమాకు మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. దాదాపు అంద‌రూ కొత్త వారితోనే ఈ సినిమాను నిర్మిస్తున్నార‌ట‌.! మూడు రోజులుగా న‌డిగూడెంలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతుంది. దీంతో న‌టీన‌టుల‌ను చూడ‌డానికి చుట్టుప‌క్క‌ల గ్రామాల నుండి జ‌నం రావ‌డంలో షూటింగ్ ప్రాంత‌మంతా కోలాహ‌లంగా ఉంద‌ట‌.! రాజ‌శేఖ‌ర్, జీవిత‌లు స్థానిక సాయిబాబా గుడిలో పూజ‌లు చేసి, క్లాప్ చిత్రాన్ని కొట్టి ప్రారంభించారు. 70 శాతం సినిమా షూటింగ్ మొత్తం ఈ గ‌డిలోనే సాగుతుంద‌ట‌.!

 

అన్న విజ‌య్ టాలీవుడ్ లో టాప్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే బాట‌లో ఈ సినిమాతో టాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.క‌థ అద్భుతంగా ఉండ‌డంతో ఇటు ఆనంద్ అటు శివానీ లు…ఈ సినిమాతో త‌మ కెరీర్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top