“విజయ్ దేవరకొండ” నటించిన “ఏ మంత్రం వేసావే” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).! అర్జున్ రెడ్డి హిట్ కొనసాగిందా.?

Krishna

Movie Title (చిత్రం): ఏ మంత్రం వేసావె (Ye Mantram Vesave)

Cast & Crew:

  • నటీనటులు: విజయ్‌ దేవరకొండ, శివాని సింగ్‌, శివన్నారాయణ, ఆశిష్‌ రాజ్‌ తదితరులు
  • సంగీతం: అబ‍్బట్‌ సమత్‌
  • నిర్మాత: గోలీసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్‌
  • దర్శకత్వం: శ్రీధర్‌ మర్రి

Story:

నిఖిల్‌ (విజయ్‌ దేవరకొండ) గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు. నెలల తరబడి తన రూమ్‌లో నుంచి బయటకు రాకుండా గేమ్స్‌ ఆడుతూ కాలం గడిపేస్తుంటాడు. తన ఫ్రెండ్స్‌ తో ఛాలెంజ్‌ చేసి మరి ఆన్‌లైన్‌లో గేమ్స్‌ లో విజయం సాధిస్తుంటాడు. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి రియల్‌ లైఫ్‌లో గేమ్‌ ఆడదామని ఛాలెంజ్‌ చేస్తుంది. (సాక్షి రివ్యూస్‌) రాగ్స్‌ (శివాని సింగ్‌) ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్‌గా పని చేస్తుంటుంది. అందరూ రక్తపాతం, పోరాటం లాంటి కాన్సెప్ట్‌ లతో గేమ్స్‌ తయారు చూస్తుంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఓ గేమ్‌ కాన్పెప్ట్‌ తీసుకువస్తుంది, కానీ బాస్‌ తన గేమ్‌ కాన్సెప్ట్‌ను రిజెక్ట్‌ చేస్తాడు. దీంతో రాగ్స్‌ తన రియల్‌ లైఫ్‌ గేమ్‌తో ఎలాగైన గేమింగ్‌ కాంపిటేషన్‌లో అవార్డు సాధించాలని నిఖిల్ ను ట్రాప్‌ చేసి గేమ్‌ లోకి లాగుతుంది. రాగ్స్‌.. నిఖిల్‌ తో ఆడిన గేమ్‌ ఏంటి..? అసలు రాగ్స్‌ ట్రాప్‌లోకి నిఖిల్‌ ఎలా వచ్చాడు..? ఈ గేమ్‌ కారణంగా నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఏం ఏం విజయాలు సాధించాడు అన్నదే మిగతా కథ.

Review:

తొలిభాగంలో కంప్యూటర్స్ గేమ్స్ బానిసైన విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడానికి దర్శకుడు చాలానే సమయం తీసుకొన్నాడు. ఇక ప్రధమార్థంలో ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా కారణంగా యూత్ ఎలా మోసపోతున్నారు అనే అంశాలతో కథను నడిపించాడు. ఇక శివానీ ప్రేమలో పడిన నిక్కి ఆరాటంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. తాను ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ట్రెజర్ హంట్ మాదిరిగా గేమ్‌ను పెట్టడం కథలో కీలకమైన పాయింట్. ఇక ఓ గ్యాంగ్ శివానీ దాడి చేయడమనే పాయింట్ వద్ద ఇంటర్వెల్ పడుతుంది.

ఇక రెండో భాగంలో విజయ్ దేవరకొండ తన ప్రేయసి కోసం ఏమి చేశాడు. ఆ క్రమంలో ఆన్‌లైన్‌లో ప్రేమ పేరుతో యువతులను మోసానికి గురిచేసే గ్యాంగ్‌ను ఎలా పట్టించాడు అనేది కొంత ఆసక్తిని రూపుతుంది. చివర్లలో అనూహ్యమైన మలుపుతో కథ స్వరూపమే మారిపోతుంది. అయితే ఇలాంటి అంశాలను సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం, పేలవమైన కథనం, నాసిరకమైన పాత్రధారుల ఎంపిక ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌ తొలినాళ్లలోనే చేసిన సినిమా కావటంతో ఏ మంత్రం వేసావె సినిమాలో ఆకట్టుకునే స్థాయి పర్ఫామెన్స్‌ చూపించలేకపోయాడు. అయితే ఇతర నటీనటులతో పోలిస్తే.. విజయ్‌ ఒక్కడే కాస్త మంచి నటన కనబరిచినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన శివాని సింగ్ పూర్తిగా నిరాశపరిచింది. లుక్స్‌ తో పరవాలేదనిపించినా.. నటన విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాకపోవటంతో పాటు క్యారెక్టరైజేషన్స్‌, పాత్రధారుల నటన కూడా ఆకట్టుకునేలా లేదు.

Plus Points:

విజయ్ దేవరకొండ
సినిమాటోగ్రఫి

Minus Points:

కథ, కథనం
టేకింగ్
ఎడిటింగ్
ప్రొడక్షన్ వ్యాల్యూస్

Final Verdict:

గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు ఆన్లైన్ మోసాలను ఎలా బయటపెట్టాడు అనేది “ఏ మంత్రం వేసావే”. చూడకపోవటమే బెటర్..!

AP2TG Rating:  1.75/ 5

Trailer:

Comments

comments