ఇది హీరోల‌కు కావాల్సింది….. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడి ఆక‌ట్టుకున్న హీరో.!

“పెళ్లి చూపులు” సక్సెస్ తో మంచి దూకుడు మీద ఉన్న హీరో “విజయ్ దేవరకొండ” కి ఇప్పుడు “ద్వారక” సక్సెస్ తో మరింత క్రేజ్ పెరిగింది. “ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, ద్వారక” ఈ మూడు సినిమాలు గమనిస్తే ప్రతి సినిమాకి “విజయ్ దేవరకొండ” ఆక్టింగ్ లో చాలా భేదాలు ఉన్నాయి. అయితే ఒక సినిమా అందరికి నచ్చాలి అని లేదు. గుడ్ టాక్ తో పాటు సినిమాకి బాడ్ టాక్ కూడా వస్తుంది. ఈ సత్యాన్ని చాలా ఇంప్రెస్స్ అయ్యేలా చెప్పాడు “విజయ్ దేవరకొండ”

“ద్వారక” సక్సెస్ మీట్ లో “విజయ్ దేవరకొండ” మాట్లాడుతూ “మొదటి రోజు సినిమాకి వెళ్లి చూడటం ఎందుకు, నా సినిమా నేను చూస్తే బాగోదు అని వెళ్ళలేదు. తరవాత సినిమా మీద రిపోర్ట్స్ వచ్చాయి. మొదట్లో మంచి టాక్ వచ్చింది. అయితే తరవాత బాడ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సినిమా అందరికి నచ్చాలని లేదు. సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. అందరికి నచ్చేలా సినిమాలు తీస్తా. నా కోరిక ఏంటి అంటే అన్ని వర్గాల సినిమాలు తీయాలని. పెద్ద పెద్ద ఆక్టర్స్ ని చూసినప్పటినుండే అలా అనుకునేవాడిని. ఈ సినిమాకోసం టీం అందరం ఎంతో కష్టపడ్డాము. అందరికి థాంక్స్!”

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top