“అర్జున్ రెడ్డి” ఈవెంట్ లో “విజయ్ దేవరకొండ” అంత వివాదాస్పదంగా మాట్లాడడానికి కారణం ఇదేనా..?

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్శించాడు.అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగటివ్ రోల్ పోషించినప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యంలో నటనతో ఆకట్టుకుని,పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.ఇప్పుడు అర్జున్ రెడ్డిగా మనముందుకొస్తున్న విజయ్ దేవరకొండ ,వి హనుమంతరావు ను తాతయ్య చిల్ అంటూ ట్వీట్ పెట్టాడు.దీనికి కారణంవిహెచ్ అర్జున్ రెడ్డి పోస్టర్ చింపేయడమే…

అర్జున్ రెడ్డి ఆగస్ట్ 25న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నాడు.మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్ ని తెగ వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో లిప్ లాక్ పోస్టర్స్ ని ఆర్టీసీ బస్సులపై అంటించారు.ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు హైదరాబాద్ లో సంచరిస్తున్న వేళ, ఆయన కంట లిప్ లాక్ చిత్ర పోస్టర్ పడింది. వెంటనే ఆ బస్సు ఆపి పోస్టర్ చించేసారు . ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ దృష్టికి కూడా ఈ విషయం చేరడంతో మనోడు ఫేస్ బుక్ వేదికగా తాతయ్య.. చిల్ అంటూ పోస్టర్ చింపే ఫోటోని షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా షాలిని పాండే నటిస్తుంది.

ఇది పక్కన పెడితే…విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది అతనిని వ్యతిరేకిస్తున్నారు. సెన్సార్ బోర్డు “ఏం మాట్లాడుతున్నావ్ రా..” అనే డైలాగ్ ను కట్ చేసింది. దానికి చాలా హైగా రియాక్ట్ అయ్యాడు విజయ్. ఆడియన్స్ అందరిని థియేటర్ లో ఆ డైలాగ్ అరవండి అన్నాడు. తల్లిని చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే ఆ బూతు తిట్టేయండి అన్నాడు. అదేం పద్దతి అని అందరు తిడుతున్నారు. ఆ వీడియో మీరే చూడండి!

watch video here:

ఒక కొత్త హీరో ఇలా చేయడం కరెక్ట్ అంటారా? సెన్సార్ బోర్డు కట్ చేయడం కొత్తేమి కాదు. ఓవర్ కాంఫిడెన్స్ గురించి ఏమో అన్నాడు. తన ఫ్రస్ట్రేషన్ ఓపెన్ గా చెప్పాడు కానీ అంత అవసరంలేదు అనుకుంట. తాగి మాట్లాడినట్టు ఆ మాటలు ఏంటి అంటున్నారు.

మరోపక్క రామ్ గోపాల్ వర్మ..విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది అనే ఫోటో ట్రెండ్ అవుతుంది.
రామ్ గోపాల్ వర్మ: ట్రైలర్ చాల బాగుంది. నన్ను నేను చూసుకున్న. కానీ నా డౌట్ ఏంటి అంటే..నేను బతికి ఉండగానే నువ్వెలా పుట్టావు.?
విజయ్ దేవరకొండ: మీరు బతికున్నప్పుడు మాత్రమే కాదు..మీ శివ సినిమా విడుదలైన ఇయర్ లోనే నేను పుట్టా!

 

Comments

comments

Share this post

scroll to top