అందరికీ ఆదర్శంగా మారుతున్న విజయ్ దేవరకొండ, ఆర్మీ కుటుంబాలకు సహాయం…

వరదలు, తూఫాన్ లు వచ్చినప్పుడు జనాలకు తనవంతు సహాయం అందించాడు ముందుండి విజయ్ దేవరకొండ, మరొక సారి తన మనస్తత్వం చాటుకున్నాడు, ఆర్మీ జవానుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించి మిగిలిన వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు, ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు విజయ్ దేవరకొండ.

మనకోసమే… :

మన కోసం ప్రాణ త్యాగాలు చేసారు వాళ్ళు. వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవడం మన బాధ్యత అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ వేసిన ట్వీట్ : ‘ వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి, సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించాను’ అని సర్టిఫికెట్ షేర్ చేసాడు విజయ్ దేవరకొండ.

గొప్పతనం..

సహాయం అందించడంలో ముందుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఎన్నో కష్టాలను చూసి పైకొచ్చాడు కనుక కష్టం వచ్చిందని తెలిస్తే చాలు తనకు తోచినంత సహాయం అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ను అనుసరించే వారి సంఖ్య కూడా ఎక్కువ ఉండటం తో అతనిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఆర్మీ కుటుంబాలకు సహాయం చేస్తారు. సినిమా హీరోలు భారతదేశ హీరోల కోసం ముందుకు రావడం మంచి విషయం.

పుల్వామా ఉగ్రవాద దాడిలో 46 మంది CRPF జవానులు మృతి చెందారు, ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ సంఘటన లో చాలా మంది జవానులు గాయపడ్డారు, కాశ్మీర్ కి చందిన 22 ఏళ్ళ కుర్రాడు జవానులు వెళుతున్న ట్రక్ కి ఎదురుగా కారు తో వెళ్లి తనని తాను కారు తో సహా పేల్చుకుని 46 మంది జవానులను బలిగొన్నాడు, ఈ కుర్రాడు పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాద సంస్థ అయిన జైష్-ఈ-మొహమ్మద్ కి సంబందించిన వాడు, దాడి జరిగిన వెంటనే దాడికి పాల్పడిన కుర్రోడి వీడియో ని విడుదల చేసారు జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం పాకిస్తాన్ నుండే కార్యకలాపాలు సాగిస్తుంది, ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ సంస్థ ద్వారా జవానులు పైన ఉగ్ర దాడి జరిపిందని అందరు గట్టిగా నమ్ముతున్నారు. కోట్లాది మంది భారతీయులు, పాకిస్తాన్ పైన ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.

tweet:

 

Comments

comments

Share this post

scroll to top