పెళ్లి చూపులు ఫేమ్ “విజయ్ దేవరకొండ” నటించిన “ద్వారక” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)…!

Movie Title: ద్వారక (Dwaraka)

Cast & Crew:

 • నటీనటులు: విజయ్ దేవరకొండ, పూజ ఝవేరి, ప్రకాష్ రాజ్ తదితరులు
 • దర్శకుడు: శ్రీనివాస్ రవీంద్ర
 • సంగీతం: సాయి కార్తీక్
 • నిర్మాత: ప్రద్యుమ్న చంద్రపతి, గణేష్ పెనుబోతు ( లెజెండ్ సినిమా)

Story:

“ఎర్ర శ్రీను” (విజయ్ దేవరకొండ) ఒక దొంగ…తన స్నేహితులు (పృద్వి, రఘు బాబు) తో కలిసి గుడిలోని “కృష్ణుడి” విగ్రహం దొంగతనం చేయాలి అనుకుంటారు…దానికోసం “ద్వారక” అనే అపార్ట్మెంట్ లో “కృష్ణ నంద స్వామి” గా పేరుసంపాదించి అమాయుకాలను దోచుకుని సమయం వచ్చినప్పుడు విగ్రహం దొంగలించాలనే ప్రయత్నం లో ఉంటాడు…అదే సమయంలో వీళ్ళ మోసాల గురించి పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) తెలుసుకొని సాక్షాలతో నిరూపించాలి అనుకుంటాడు…కృష్ణ నంద స్వామి దగ్గరికి వచ్చిన ఒక భక్తురాలు కూతురు హీరోయిన్ (పూజ ఝవేరి)…ఆమెతో లవ్ లో పడతాడు “ఎర్ర శీను”…ఆమె ప్రేమతో మంచివాడిగా మారతాడు మన హీరో…కానీ ఇంతలో ఒక పెద్ద దొంగ (బాహుబలి కాలకేయ ప్రభాకర్) కృష్ణుడి విగ్రహం దొంగలించి కేసుని మన హీరోపై వచ్చేలా చేస్తాడు…
మరి “ఎర్ర శీను” ఈ సమస్యనుండి ఎలా బయటపడ్డాడు?  పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నాడు? ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? దొంగల అంతు చూసాడా? లేడా? అనేవి తెలియాలి అంటే “ద్వారకా” సినిమా చూడాల్సిందే!

Review:

“పెళ్లి చూపులు” హిట్ తో మంచి దూకుడు మీద ఉన్నాడు “విజయ్ దేవరకొండ”…సోషల్ మీడియా లో కూడా ఈ సినిమాకి మంచి ప్రమోషన్ వచ్చింది…ట్రైలర్ తోనే ఎంతో మందిని ఆకట్టున్నారు ఈ చిత్ర దర్శుకుడు…ప్రకాష్ రాజ్, పృద్వి వి ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలు…ఈ సినిమాలోని కామెడీ సీన్స్ కి అయితే థియేటర్లో నవ్వలేకచావాల్సిందే!..”సాయి కార్తీక్” అందించిన బ్యాక్ స్కోర్ కూడా బాగుంది..!సినిమాటోగ్రఫీ కూడా బాగుంది…ముక్యంగా “విజయ్, పూజ” కెమిస్ట్రీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది..! కాకపోతే సెకండ్ హాఫ్ చాలా స్లో గా బోరింగ్ గా సాగుతుంది!..”గుంటూరోడు”, “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలకి మంచిపోటి అందించింది “ద్వారకా”

Plus Points:

 • విజయ్ డ్యూయల్ రోల్ పెర్ఫార్మన్స్
 • పృద్వి, రఘు బాబు, శాఖల శంకర్ కామెడీ
 • పూజ జవేరి – విజయ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సినిమాటోగ్రఫీ
 • ట్రైలర్, ప్రమోషన్స్

Minus Points:

 • రొటీన్ స్టోరీ
 • స్లో సెకండ్ హాఫ్

Final Verdict:

“పూజ ఝవేరి, విజయ్” రొమాంటిక్ లవ్ స్టోరీ, డ్యూయల్ రోల్ లో “విజయ్” పెర్ఫార్మన్స్…”షకలక శంకర్, పృద్వి, రఘు బాబు” కామెడీ…విలన్ రోల్ లో “ప్రభాకర్”…”పోలీస్ రోల్” లో “ప్రకాష్ రాజ్”…ఇవన్నీ కలిపితే “ద్వారక” సినిమా…మొత్తానికి “విజయ్” మరో హిట్ అందుకున్నాడు!

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top